ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ఎన్ని ఫ్యామిలీలు ఉన్నా కానీ నందమూరి అని పేరు చెప్పగానే అందరి అభిమానులు చేతులెత్తి దండం పెడతారు. అలాంటి ఒక క్రేజీ స్థానాన్ని సంపాదించి పెట్టారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కాగా ఇండస్ట్రీలో ఎన్నో ప్యామిలీస్ ఉన్న ఎందుకు అందరూ నందమూరి హీరోలను లైక్ చేస్తూ ఉంటారు . సపోర్ట్ చేస్తూ ఉంటారు ..గౌరవిస్తూ ఉంటారు అని చెప్పడానికి ప్రధాన కారణం మాత్రం ఆ ఇంటి నుండి వచ్చిన ప్రతి హీరో ఆడవాళ్ళ పట్ల చూపించే గౌరవం ..ప్రవర్తించే తీరు అని చెప్పక తప్పదు .
నేటి కాలం జనరేషన్ ఎలా ఉన్నారో మనకు తెలిసిందే. మాట్లాడితే పార్టీ ..లేదంటే అమ్మాయిలను టీస్ చేయడం .. లవ్ పేరుతో ఎంజాయ్ చేసే వదిలేయడం.. ఇలాంటివే ఉన్నాయి . మన ఇండస్ట్రీలోని చాలామంది స్టార్ హీరో కొడుకులు కూడా ఇలాగే చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు . అయితే ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్క హీరో కూడా అలాంటి తప్పుడు పని చేసి వార్తలకు ఎక్కిన సందర్భాలు లేవు . అంతేకాదు నందమూరి బాలయా కొడుకు మోక్షజ్ఞ కూడా చాలా సైలెంట్ బాయ్ అనిపించుకున్నాడు .
ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలకి మోక్షజ్ఞ కి చాలా తేడా ఉంది అంటూ కూడా స్టార్ హీరోలు చెప్పుకొచ్చారు . అంతేకాదు నందమూరి ఫ్యామిలీలో ఉండే ప్రతి అబ్బాయి కూడా పార్టీలు పబ్ లు..అనే కల్చర్ కన్నా సాంప్రదాయ పద్ధతిలోనే ఉండడానికి ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి దగ్గర నుంచి మోక్షజ్ఞ వరకు అందరూ కూడా నీతి నిజాయితీ అంటూ వెళ్లేవారే .. పైగా అందరి నందమూరి వారసులకు జాలి – దయ అనేది కూసింత ఎక్కువే . అందుకే కొందరు అభిమానులు వీళ్ళకి అది బ్లడ్ తో వచ్చిన జబ్బు అని తరతరాలుగా వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ అదే నీతి నిజాయితీని ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పుకొస్తున్నారు..!!