Moviesజెనీలియ ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం అడిగిన తెలుగు హీరో తండ్రి.....

జెనీలియ ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం అడిగిన తెలుగు హీరో తండ్రి.. గూబ గుయ్యమనే ఆన్సర్ ఇచ్చిన తల్లి..!!

జెనీలియా.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోయిన్గా మారిపోయింది . జనరల్గా హీరోయిన్స్ పై హీరోలకి ఓ రకమైన అభిప్రాయం ఉంటుంది. హీరోయిన్స్ ఎక్కువమందితో లవ్ ట్రాక్ నడుపుతూ ఉంటారని ..అవసరానికి వాడుకొని వదిలేస్తూ ఉంటారు అని పలువురు హీరోలు డైరెక్ట్ గానే ఇంటర్వ్యూలో చెప్పుకొని వచ్చారు . అయితే ప్రతి ఒక్క హీరో మాత్రం జెనీలియా గురించి పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈమె. ప్రతి ఒక్క హీరో కూడా ఆమెపై పాజిటివ్ కామెంట్స్ చేశారు.

అయితే ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరో కొడుకు జెనీలియాతో అసభ్యకరంగా ప్రవర్తించడానికి చూశాడు అన్న వార్త అప్పట్లో వైరల్ అయింది . ఓ సినిమా షూట్ లో భాగంగా నిజంగానే లిప్ కిస్ పెట్టడానికి ట్రై చేశారట. ఫైర్ అయిపోయిన జెనీలియా చంపకేసి కొట్టబోయ్యింది..? అంటూ కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆమె పై మోజు పడ్డ ఆ హీరో కొడుకు డైరెక్ట్ గా జెనీలియా ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధాన్ని అడిగారట.

అప్పటికే జెనీలియా రితేష్ దేశముఖ్ తో పీకల్లోతు ప్రేమలో ఉండిపోయింది. దీంతో ఫుల్ ఫైర్ అయిపోయిన తల్లి “ముందు ఆడపిల్లల తో ఎలా ప్రవర్తించాలి అనేది మీ కొడుకుకి నేర్పించండి సార్.. ఆ తర్వాత పెళ్లి సంబంధం గురించి అడగడానికి మా ఇంటికి రండి ” అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయి మర్యాదగానే ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి పంపించింది .ఈ వార్త అప్పట్లో వైరల్ గా మారింది. అంతేకాదు అప్పటినుంచి జెనీలియా ఆ హీరో పక్కన నటించిందే లేదు. అంతేకాదు జెనీలియా ఇప్పటికీ ఆ హీరో చేసిన పని మర్చిపోలేక పోతుందట . బాలీవుడ్ మీడియాలో రీసెంట్గా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా అదే విషయాన్ని పరోక్షంగా గుర్తు చేసుకుంది జెనీలియా..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news