దసరా కానుకగా మాస్ మహారాజు రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరాకు బాలయ్య భగవంత్ కేసరి, తమిళ్ హీరో విజయ్ లియో సినిమాలకు పోటీగా ఈ సినిమా రిలీజ్ అయింది. స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. వంశీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు.
అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందించారు. ఇప్పటికే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ కొట్టి ఆ తర్వాత రావణాసురతో పెద్ద డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్న రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అక్టోబర్ 20న పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అయింది.
ఈ సినిమాకు మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన లభించింది. టాక్ అనుకూలంగా లేకపోవడంతో సినిమాకు తొలి రోజే దెబ్బ తగిలింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే టైగర్ నాగేశ్వరరావు ఇంకా రు. 30.12 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఈ టాక్ తో బాలయ్య, విజయ్ సినిమాలో పోటీని తట్టుకుని అంత షేర్ రాబట్టటం టైగర్ నాగేశ్వరరావుకు ఏమాత్రం సాధ్యం అయ్యేలా లేదు. ఈ డ్రాఫ్స్ ఇలాగే ఉంటే టైగర్ డిజాస్టర్ దిశగా వెళుతున్నట్టే. టైగర్ నాగేశ్వరరావు ఏరియాల వారీగా రెండు రోజుల కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాం – 2.45 కోట్లు
సీడెడ్ – 1.10 కోట్లు
ఉత్తరాంద్ర – 74 లక్షలు
ఈస్ట్ – 60 లక్షలు
వెస్ట్ – 37 లక్షలు
గుంటూరు: 80 లక్షలు
కృష్ణ: 44 లక్షలు
నెల్లూరు: 28 లక్షలు
ఏపీ+తెలంగాణ= 6.78 కోట్లు(11.15 కోట్లు~ గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 0.75 కోట్లు