తెలుగు సినిమా పరిశ్రమలో లెజెండ్రీ నటులు ఎవరు అంటే ? ముందుగా వినిపించే పేరు దివంగత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు.. ఆ తర్వాత నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు – సూపర్ స్టార్ కృష్ణ పేర్లు వినిపిస్తాయి. ఈ ముగ్గురు ఆ తరం హీరోలలో పోటీపడి మరి సినిమాలలో నటించేవారు. ఈ ముగ్గురు ఇప్పుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం.
నిజం చెప్పాలంటే తెలుగు సినిమా ఖ్యాతిని ఈ ముగ్గురు హీరోలు దేశవ్యాప్తంగా వెలిగెత్తి చాటారు. వందలో వందలాది సినిమాలతో కోట్లాది ప్రేక్షకులను అలరించి తెలుగు సినిమా పేరుని మరింత గొప్పగా వెలుగెత్తి చాటారు. వీరు మన మధ్యన లేకపోయినా వారి సినిమాలు అందులో వారు పోషించిన పాత్రల రూపంలో ఎప్పుడు మన మదిలో ఉంటారు. గొప్ప విషయం ఏంటంటే ఈ ముగ్గురు లెజెండ్రీ నటీనటుల పేర్లతో మాస్ మహారాజ్ రవితేజ సినిమాలు చేశారు.
ఈ ముగ్గురు లెజెండ్రీ హీరోల పేర్లను తన సినిమాలు టైటిల్ గా పెట్టుకున్నారు. ఎన్టీఆర్ పేరు కలిసి వచ్చే రామారావు ఆన్ డ్యూటీ – సూపర్ స్టార్ కృష్ణ పేరు కలిసి వచ్చేలా కృష్ణ – నాగేశ్వరరావు పేరు కలిసి వచ్చేలా తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా చేశారు. ఈ మూడు సినిమాలలో కృష్ణ సూపర్ డూపర్ హిట్.. రామారావు ఆన్ డ్యూటీ పెద్దగా సక్సెస్ కాలేదు.
ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా ఈ దసరాకు రిలీజ్ కాగా ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అలా ముగ్గురు లెజెండ్స్ పేర్లతో సినిమాలు తీసిన ఏకైక టాలీవుడ్ హీరోగా రవితేజ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.