Moviesఅమ్మ దొంగ..కమల్ తో సినిమా చేస్తుంది అందుకా..? ఒక్కే దెబ్బకి రెండు...

అమ్మ దొంగ..కమల్ తో సినిమా చేస్తుంది అందుకా..? ఒక్కే దెబ్బకి రెండు పిట్టలు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఎలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ హీరోతో నటిస్తే మన క్రేజ్ డబల్ అవుతుంది అని తెలిసిన హీరోలతోనే నటిస్తున్నారు. తమ వయసుకు ఏమాత్రం అటు ఇటుగా ఉన్న పర్లేదు అంటూ ఓకే చెప్పేస్తున్నారు . మరీ ముఖ్యంగా యంగ్ బ్యూటీలు తమ వయసు ఉన్న హీరోలతో కూడా రొమాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు .

అయితే వాళ్లందరికీ భిన్నంగా నయనతార చూస్ చేసుకుంటుంది కథలను అనే ఒక పేరు ఉంది . నయనతార హీరో క్రేజ్ ని కాదు సినిమా కంటెంట్ ని చూస్తుంది అన్న పేరు ఆమెకు ఎప్పటినుంచో ఉంది . అయితే రీసెంట్ గా నయనతార కమల్ హాసన్ తో కలిసి ఓ సినిమాను యాక్సెప్ట్ చేసింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి . ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ద కాలాలు దాటుతున్న సరే నయనతార కమలహాసన్ కాంబినేషన్లో ఒక్క సినిమా పడలేదు. ఫైనల్లీ ఆ కోరికలు తీర్చేయబోతున్నారు డైరెక్టర్ మణిరత్నం .

మణిరత్నం దర్శకత్వంలో హీరోగా కమలహాసన్ హీరోయిన్గా నయనతార ప్రాజెక్టు తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ దాదాపు 500 కోట్లు పెట్టి నిర్మించబోతున్నారట నిర్మాతలు కమల్ హాసన్ కెరియర్ లోనే ఇది ఓ మైలురాయిగా నిలవబోతోంది అంటూ తెలుస్తుంది . అయితే క్రేజీ రోల్స్ వస్తున్నా కానీ నయనతార కమల్ లాంటి సీనియర్ ఓల్డ్ హీరోతో నటించడానికి మెయిన్ రీజన్ ఆయనకున్న క్రేజ్ పాపులారిటీ అంటూ తెలుస్తుంది . చిన్న హీరోలతో నటించి హిట్ కొట్టడం కన్నా ఒకేసారి పెద్ద హీరోలతో నటించి హిట్ కొడితే ఆ క్రేజ్ వేరేగా ఉంటుంది అని .. పైగా కమల్ హాసన్ తో నటించాలని ఆమె ఎప్పటినుంచో కోరుకుంటుందని ..ఆ కారణంగానే వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోలేదు అంటూ తెలుస్తుంది మొత్తానికి నయనతార కూడా కమల్ ఖాతాలో చేరిపోయిందన్నమాట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news