ప్రముఖ హాస్య దర్శకుడు.. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన హిట్ కామెడీ సినిమా చంటబ్బాయ్. ఈ సినిమాలో సుహాసినితో కలిసి చిరంజీవి తెరను పంచుకున్నారు. అయితే.. ఈ సినిమా అంతా కూడా కామెడీకే ఎక్కువగా ఫోకస్ ఇచ్చారు. మధ్యలో స్టోరీలో థ్రిల్ ఉన్నా.. మెజారిటీ పార్ట్ అంతా కూడా.. కామెడీ చుట్టూతానే తిరుగుతుంటుంది. నిజానికి ఈ సినిమాను జంధ్యాల కు ఇచ్చిన మాట ప్రకారం చిరు చేశారనే టాక్ ఉంది.
కథను విన్నాక బాగుందని చెప్పారు. కానీ, దీనిని కామెడీ ట్రాక్ ఎక్కిస్తారని చిరు భావించలేదు. అయితే.. సినిమా మొత్తం కామెడీ ట్రాక్‌లో నడుస్తుంది. డైలాగుల నుంచి నటన వరకు కూడా.. చిరు అభినయం ఈ సినిమాలో హైలెట్. అయితే.. ఈ సినిమా హిట్టయింది. కానీ, తర్వాత వచ్చిన అవకాశాలన్నీ కూడా కామెడీ ట్రాక్ సినిమాలే కావడంతో చిరు చాలా ఇబ్బంది పడ్డారని అంటారు.
ఎక్కువగా కామెడీ సెంటిమెంటుగానే ఆయనకు సినిమాలు వచ్చాయట. దీంతో వాటిని కాదనలేక.. ఇబ్బంది పడినట్టు ఆయన బావమరిది,నిర్మాత అల్లు అరవింద్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఎందుకంటే.. అయిందేదో అయిపోయింది. ఇక, అలాంటి సినిమాలు చేస్తే.. అభిమానులు హర్టవుతారని చిరు భావించారట. దీంతో తర్వాత సినిమాలను ఎంచుకునేందుకు.. చాలా సమయం పట్టిందని.. సుమారు ఆరు మాసాల పాటు చిరు ఖాళీగానే ఉండిపోయారని అరవింద్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
అలాగని చంటబ్బాయ్‌లో నటించినందుకు చిరంజీవి ఎప్పుడూ బాధపడలేదన్నారు. దీనిని ఒక ప్రయోగంగా భావించారని, గొప్ప దర్శకుడి దగ్గర పనిచేయడం తన కు ఒక అనుభవం వంటిదని కూడా చిరు భావించారని ఆయన చెప్పారు. కానీ, చంటబ్బాయ్ ప్రభావం పోవడానికి, అభిమానులను మెప్పించడానికి అప్పట్లో చాలా కష్టపడాల్సి వచ్చిందని అరవింద్ చెప్పారు. ఇదీ.. సంగతి..!