మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తాజాగా వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని స్టూవర్ట్‌పురం గజదొంగ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కృతిసనన్ సోదరి నుపూర్ సనన్ ఒక హీరోయిన్గా నటించగా.. రెండో హీరోయిన్గా గాయత్రి భరద్వాజ్ నటించారు. గాయత్రి 2018 మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్నారు. రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న గాయత్రి భరద్వాజ్ తాజాగా చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గాయత్రి టాలీవుడ్ లో స్టార్ హీరో అభిమాని అతడితో ఆమెకు పెళ్లి కూడా అయిపోయిందట. ఈ విషయాన్ని గాయత్రి స్వయంగా చెప్పింది. మరి ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు ? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
తాను రామ్ చరణ్ కు పెద్ద ఫ్యాన్.. రాంచరణ్‌ను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకునే దానిని అని తెలిపింది. అప్పుడు యాంకర్ చరణకు ఆల్రెడీ ఉపాసనతో పెళ్లి అయిపోయింది కదా ? అని ప్రశ్నించింది. వెంటనే గాయత్రి అవును.. కానీ నా కళ్ళల్లో, ఊహల్లో ఎప్పుడూ తాను ఆయనను పెళ్లి చేసుకున్నాను అంటూ గాయత్రి చెప్పుకొచ్చింది. ఈ కామెంట్లను మెగా అభిమానులు సరదాగా వైరల్ చేస్తున్నారు.