వామ్మో ..ఏంటిది కోహ్లీ భార్య అనుష్క శర్మ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా? ఎందుకని ..? అసలు ఏమైంది ..? ఇలాంటి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ఎక్కువగా వినిపిస్తున్నాయి . అనుష్క శర్మ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . మొదట అందాల ముద్దుగుమ్మగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత హీరోయిన్గా .ఆ తర్వాత మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా.. ఆ తర్వాత మంచి ప్రొడ్యూసర్ గా ..పాపులారిటీ దక్కించుకున్న అనుష్క శర్మ ..ఫైనల్లీ కోహ్లీ భార్యగా తనకు కావాల్సిన పేరుని దక్కించుకునింది .
రీసెంట్గా అనుష్క సంబంధించిన న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది . అనుష్క శర్మ ఇక సినిమాలు చేయద్దు అని గుడ్ బాయ్ చెప్పబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అనుష్క తన వద్దకు వచ్చిన డైరెక్టర్స్ కథ వినకుండానే రిజెక్ట్ చేస్తుందట . అంతేకాదు గత కొన్ని రోజుల నుంచి అనుష్క శర్మ కి సెకండ్ బేబీ కన్ఫర్మ్ అయింది అని కోహ్లీ బర్త డే సందర్భంగా అఫీషియల్ గా ఈ న్యూస్ ని చెప్పబోతుంది అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. ఇలాంటి మూమెంట్లోనే అనుష్క శర్మ తన వద్దకు వచ్చిన డైరెక్టర్స్ ను రిజెక్ట్ చేస్తూ ఉండడం అదే టైంలో గతంలో ఆమె మాట్లాడిన ఓ ఇంటర్వ్యూలోని మాటలు ట్రెండ్ అవ్వడం ఇప్పుడు అభిమానులకి అయోమయానికి గురిచేస్తుంది .
గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”అనుష్క శర్మ పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను సినిమాల్లో నటించలేకపోవచ్చు .. నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు ..పెళ్లి తర్వాత నా టోటల్ లైఫ్ నా భర్తకి నా పిల్లలకి అంకితం .. అలానే భావిస్తున్నాను అంటూ చెప్పుకు వచ్చింది. ” దీంతో అదే కామెంట్స్ ను ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . నిజంగా అనుష్క ప్రెగ్నెంట్ అయితే ఇక సినిమాలకు గుడ్ బాయ్ అంటూ ఫిక్స్ అయిపోవాల్సిందే అని తమకు తామే నచ్చ చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్..!!