సినిమా ఇండస్ట్రీలో ఉండే కొందరు హీరోలు సినిమాలలో నటిస్తూ మరోపక్క కొన్ని యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటారు . దానికి హ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటూ ఉంటారు. మన ఇండస్ట్రీలో ఉండే కొందరు టాప్ హీరోలు కూడా అలానే చేస్తున్నారు . ఆ లిస్టులోకే వస్తాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . ఓవైపు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న చరణ్ రీసెంట్ గా ప్రముఖ బట్టల బ్రాండ్ మాన్యవార్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయ్యాడు . దీనికి సంబంధించి యాడ్ కూడా షూట్ చేశారు.
రీసెంట్ గా ఆడ్ రిలీజ్ అయింది . ఓ తండ్రి పై కొడుకు చూపే ప్రేమను ఈ యాడ్లో మనం బాగా చూడవచ్చు . మరీ ముఖ్యంగా ఈ యాడ్ లోని డైలాగ్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పిన వే ఆఫ్ డెలివరీ .. అక్కడ తండ్రి స్థానంలో చిరంజీవి ఉంటే మరింత బాగుండేది అనిపిస్తుంది అభిమానులకి . ఇక యాడ్ విషయానికి వస్తే నాన్న గురించి వివరిస్తూ ..
“అడుగులో అడుగు వేస్తూ చాలా నేర్చుకున్నాను ..ఆయనను చూసే పనిలో పట్టుదలతో ఉండాలని నేర్చుకున్నాను .. మనల్ని ప్రేమించే వారిని ఇంకా ఎక్కువగా ప్రేమించాలి అని తెలుసుకున్నాను .. తన గురించి ఆలోచించని వారి కోసం మనం ఆలోచించాలి అనే నిర్ణయం తీసుకున్నాను.. అన్ని నాన్నను చూసే నేర్చుకున్నాను.. జీవితంలో నిలబడడానికి నాన్నని చూసే నేర్చుకున్నాను..” అంటూ రాంచరణ్ ప్రతి ఒక్క డైలాగ్ ను ఎంతో ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. దీంతో ఈ యాడ్ చూసిన జనాలు తండ్రి స్థానంలో చిరంజీవి ఉంటే ఇంకా బాగుండేది అంటున్నారు . అంతేకాదు ఇది మొత్తం చిరంజీవిపై చరణ్ చెప్తున్న డైలాగ్స్ గాని ఫీల్ అయిపోతున్నారు..!!