ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో దేశవ్యాప్తంగానే సూపర్ పాపులర్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. గతంలో విజయ్ – లోకేశ్ కాంబినేషన్లో వచ్చిన మాస్టర్ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే లోకేష్ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులను పూల్స్ చేసి పడేసాడు
విచిత్రం ఏంటంటే ఈ సినిమా ఇప్పటికే వచ్చిన పలు సినిమాలకు కాపీగా ఉందన్న విమర్శలు వచ్చేసాయి. తెలుగులో జగపతిబాబు హీరోగా గాయం 2 పేరుతో హాలీవుడ్ మూవీ ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్ పేరుతో ప్రీమేక్ అయ్యి ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు అదే హాలీవుడ్ సినిమా నుంచి ప్లాట్ పాయింట్ తీసుకుని దానికి తన సినిమాలలో కామన్ పాయింట్ డ్రగ్ రాకెట్ తో లింకుపెట్టి లియో సినిమాను ఒక కలగాపులగం చేసి పడేసాడు లోకేష్.
అసలు లియో సినిమాలో కరెంటు చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఎప్పుడో భాషా రోజుల్లో చూసిన పాయింట్‌నే మళ్లీ అటు ఇటు తిప్పి తీసాడు అన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో పెద్ద డాన్ అయిన వ్యక్తి కొన్ని కారణాలతో ఆ గతాన్ని పక్కన పడేసి ఒక సామాన్యుడిలా జీవిస్తాడు. తెలుగులో ఇంద్ర – సమరసింహారెడ్డి సినిమాలలో కూడా ఇలాంటివి మనం చూసేసాం. అనుకోకుండా ఎవరో తనను గుర్తించి గతాన్ని గుర్తుచేస్తూ అతడిని వెంటాడుతారు.. దీంతో అతను మీరు అనుకునే వ్యక్తిని నేను కాదు బాబోయ్ అని తలబాదుకుంటూ ఉంటాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ఈ పాయింట్ మీదే కథ నడుస్తూ ఉంటుంది.
అతడిని వెతుకుతూ వరుసగా గ్యాంగులు వస్తుంటాయి. సినిమా మొదలైనప్పటి నుంచి ఇదే వరుస. మధ్యలో లియో గురించి సిల్లీప్లాష్ బ్యాక్.. ఆ తర్వాత ప్రజెంట్ కాలంలోకి వచ్చాక పైన చెప్పిన గొడవకు రిపీటెడ్‌గా సీన్లు.. ఇవన్నీ చూపిస్తూ ఇప్పుడు కనపడుతోన్న లియోనే హీరో అన్న సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి చేసిన ప్రయత్నం నీరుగారిపోయింది.