Moviesమరికొద్ది గంటల్లో "భగవంత్ కేసరి" రిలీజ్.. సంచలన కామెంట్స్ చేసిన కాజల్..!!

మరికొద్ది గంటల్లో “భగవంత్ కేసరి” రిలీజ్.. సంచలన కామెంట్స్ చేసిన కాజల్..!!

నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య తాజాగా నటించిన సినిమా భగవంత్ కేసరి . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయనకు జోడిగా కాజల్ నటించగా కూతురు పాత్రలో శ్రీ లీల నటించింది . కాగా ఈ సినిమా మరికొద్ది గంటలోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే థియేటర్స్ వద్ద బాలయ్య అభిమానుల హంగామా ఎక్కువగా కనిపిస్తుంది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ అగర్వాల్ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ” ఈ మధ్యకాలంలో సినిమాలు ఎలాంటివి వస్తున్నాయో మనం బాగా గమనించవచ్చు. అయితే ఈ సినిమా ఆ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది సమాజానికి చాలా చాలా అవసరమైన కథ ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు కచ్చితంగా చూడాల్సిన సినిమానే ఇది “.

“ఆడపిల్లలను బలంగా తయారు చేయాలని అంశం బాగా నచ్చింది . నా క్యారెక్టర్ చాలామందిని ఆలోచింపజేస్తుంది. ఒక తల్లిగా ఇలాంటి పాత్ర చేయడం నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మనం చేస్తున్న పని ఏదైనా సరే ఇష్టంగా చేస్తే అది ఇంకా ముందుకెళ్తుంది. ప్రతి తల్లిలాగే ప్రొఫిషనల్ లైఫ్ తో పాటు వృత్తిని సమన్వయం చేసుకుంటున్నాను. ఈ జర్నీలో మా అమ్మ పాత్ర చాలా కీలకమైనది . ఆమె గురించి నేను ఎంత చెప్పినా తక్కువే” అంటూ కాజల్ చెప్పుకొచ్చింది . దీంతో సినిమాపై కాజల్ మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news