నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి థియేటర్లలోకి దిగేందుకు మరికొద్ది గంటల టైం మాత్రమే ఉంది. మరోవైపు విజయ్ లియో – రవితేజ టైగర్ నాగేశ్వరరావు లాంటి క్రేజీ సినిమాలు పోటీలో ఉన్నా కూడా భగవంత్ కేసరి పై అంచనాలు గట్టిగా ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య నటించిన చివరి సినిమా వీర సింహారెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చి తొలిరోజు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల గ్రాస్ వసూలు కొల్లగొట్టింది.
ఇటు అనిల్ రావిపూడి డైరెక్టర్.. అటు బాలయ్య రెండు వరుస సూపర్ డూపర్ హిట్లతో ఉండటంతో పాటు బాలయ్య ఏజ్‌కు తగ్గ క్యారెక్టర్ చేయటం కాజల్, శ్రీలీల లాంటి క్రేజీ కాంబినేషన్‌తో ఈ సినిమాపై రిలీజ్ ముందే చాలా పాజిటివ్ బజ్ ఉంది. దీనికి తగినట్టుగా ట్రైలర్ కూడా మంచి అంచనాలు క్రియేట్ చేసింది. దీంతో సినిమా మొదటిరోజు ఎలాంటి ? టాక్ అందుకుంటుంది తొలి రోజు వసూళ్లు ఎలా ఉంటాయి ?అన్నదానిపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
భగవంత్ కేసరి సినిమా ఏ ఏరియాలో ఎంత బిజినెస్ చేసింది ? అన్న వివరాలు చూద్దాం. నైజాంలో బాలయ్య కెరీర్ లోనే అత్యధికంగా 14.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది – సీడెడ్‌లో 13 కోట్లు – ఉత్తరాంధ్రలో 8 కోట్లు – నెల్లూరులో 2.6 కోట్లు – గుంటూరులో 6 కోట్లు – కృష్ణాలో నాలుగు కోట్లు – ఏపీ, తెలంగాణలో మొత్తంగా భగవంత్ కేసరి ఊహించని స్థాయిలో 57 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 4.25 కోట్లు – ఓవర్సీస్ లో 6 కోట్ల వరకు బిజినెస్ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రు. 67 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసింది. బాలయ్య సినిమాల్లోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమాల్లో భగవంత్ కేసరి రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రు. 68 కోట్ల షేర్ కలక్షన్లులో రాబట్టాలి. సినిమాకు హిట్టు టాకు వస్తే ఈ టార్గెట్ పెద్దది కాదని చెప్పాలి. ఇటు దసరా సెలవులు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా బాలయ్య – అనిల్ రావిపూడి మ్యాజిక్ పై అంచనాలు మామూలుగా లేవు.