టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా సినిమా టైగర్ నాగేశ్వరరావు స్టువర్ట్పురం గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీ దర్శకుడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్ సోదరి నుపూర్ సనన్ – గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లు నటించారు. చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్ మాజీ హీరోయిన్ రేణు దేశాయ్ ఈ సినిమాలో హేమలత లవణం పాత్రలో కనిపిస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు థియేటర్లలోకి దిగుతోంది. ఈ సినిమా ఇటు బాలయ్య భగవంత్ కేసరి, అటు తమిళ స్టార్ హీరో విజయ్ లియో సినిమాలకు పోటీగా వస్తుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లు మాత్రం ఆశించిన స్థాయిలో జరగటం లేదు. ఈ సినిమా రన్ టైం ఏకంగా 182 నిమిషాల పాటు ఉంది.
తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే చాలా నిరాశగా కనిపిస్తున్నాయి. గంటకి రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి కేవలం 400 టికెట్లు రేంజ్ లో మాత్రమే అమ్ముడుపోతున్నాయట. చెప్పాలంటే ఈ సినిమాపై ఇప్పటికి వరకు ఉన్న అంచనాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. మన మాస్ హీరో మూవీస్ అంటే కౌంటర్ దగ్గర ఫ్రీ రిలీజ్ బుకింగ్స్ అదిరిపోతాయి.
అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమాకు మాత్రం ఇంత దారుణంగా అడ్వాన్స్ బుకింగ్‌లు ఉండడంతో సినిమా మేకర్స్ కూడా కాస్త టెన్షన్ లో ఉన్నట్టే కనిపిస్తోంది. ఏది ఏమైనా సినిమాకు మంచి టాక్ వస్తే ఎక్కువ వసూళ్లు రాబడుతుందన్న ధీమాతో ఉన్నారు నిర్మాతలు, ట్రేడ్ వర్గాలు.