Moviesరాజమౌళితో సినిమా..మహేశ్ బాబు ఆన్సర్ వింటే మెంటల్ ఎక్కిపోతాది.. ఇంత సెన్స్...

రాజమౌళితో సినిమా..మహేశ్ బాబు ఆన్సర్ వింటే మెంటల్ ఎక్కిపోతాది.. ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమరా..!

ప్రజెంట్ సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాలలో మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కూడా ఒకటి . ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇప్పటివరకు రాలేదు .. కాని తెరవెనక మాత్రం భారీ భారీ ప్లాన్సే జరుగుతున్నాయి . అంతేకాదు రాజమౌళి కని విని ఎరుగని రేంజ్ లో మహేష్ బాబును ఈ సినిమాలో చూపించబోతున్నాడట .

కాగా ఎప్పుడు సినిమా షూట్స్ లో బిజీగా ఉండే మహేష్ బాబు రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఈవెంట్లో మెరిశారు. తన భార్య నమ్రత శిరోద్కర్ తో కలిసి గౌరీ సిగ్నేచర్ షోరూమ్ ఓపెనింగ్ ఈవెంట్లో పాల్గొన్నారు . ఇప్పటివరకు సింగిల్గానే పలు ఈవెంట్స్ కి అటెండ్ అయిన మహేష్ బాబు .. ఫర్ ద ఫస్ట్ టైం నమ్రతతో కలిసి ఈవెంట్ కి అటెండ్ అవ్వడం గమనార్హం .

ఈ షోరూం ఈవెంట్లో పాల్గొన్న మహేష్ బాబు ని మీడియా ప్రతినిధులు రాజమౌళి సినిమాపై ప్రశ్నించారు. దీంతో మహేష్ బాబు నవ్వుతూ ..”చెప్తాము ..తొందర ఎందుకు ..కంగారు పడకండి సార్” అంటూ చాలా ఫన్నీ గా రియాక్షన్ ఇచ్చారు . ఇది ఆధ్యాంతం నవ్వులు పూయించింది . అంతేకాదు గుంటూరు కారం పై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు . దీనికి మహేశ్ “సినిమా చూస్తారు ..త్వరలోనే.. మీకే అర్థమవుతుంది.. ఫుల్ డైలాగ్స్ తో బాగా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ” అని చెప్పడం విశేషం . ప్రెసెంట్ ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news