రాశి.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ ముద్దుగుమ్మ ఒకానొక సమయంలో తీరిక లేని హీరోయిన్ గా అనేక సినిమాలు చేసింది. ఈ సౌందర్యతార ముచ్చటైన హావభావాలతో, చక్కని రూపంతో అప్పట్లో చాలామందికి డ్రీమ్ గర్ల్ గా ఉండేది. మంచి నటనతో సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గొప్ప పేరు తెచ్చుకుంది. ఆమె చాలా సినిమాల్లో నటించింది, కానీ కొద్దిగా ఆలస్యంగా స్టార్ డం సంపాదించింది.
ఆమె కొన్ని కామెడీ విలన్ రోల్స్ కూడా పోషించింది. కెరీర్ పరంగా ఆమె సక్సెస్ అయ్యింది కానీ వ్యక్తిగత జీవితంలో కొన్ని వైవాహిక సమస్యలను కూడా ఎదుర్కొంది. వివరాల్లోకి వెళితే, రాశి ఓ స్టార్ హీరోతో విడాకుల వ్యవహారంలో చిక్కుకుందని సోషల్ మీడియాలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ స్టార్ హీరో ఎవరు, ఈ రూమర్ వెనుక నిజమెంత ? తెలుసుకుందాం.
గతంలో ప్రముఖ లవర్ బాయ్ హీరోగా పేరు తెచ్చుకున్న వడ్డే నవీన్ చాలా మంచి సినిమాలు చేశాడు. స్టార్ హీరో ట్యాగ్ కూడా సంపాదించాడు. అతను 30 కంటే ఎక్కువ చిత్రాలలో నటించాడు, కానీ చివరి దశలో స్క్రిప్ట్‌ల ఎంపిక సరిగా లేకపోవడంతో అతని కెరీర్ పతనమయింది. ఈ హీరో దిగ్గజ నటుడు ఎన్టీఆర్ మనవరాలు చాముండేశ్వరిని వివాహం చేసుకున్నాడు. అయితే వీరి దాంపత్యం ఎక్కువ కాలం నిలవకపోవడంతో విడాకులు తీసుకున్నారు.
వడ్డే నవీన్‌తో రాశి రొమాంటిక్ అఫైర్ పెట్టుకుందని, అదే వారి విడాకులకు కారణమని అప్పట్లో సినీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. మనసిచ్చి చూడు, ఫ్రెండ్స్, మా ఆవిడమీద ఒట్టు.. మీ ఆవిడ చాలా మంచిది లాంటి చిత్రాల్లో రాశి, వడ్డే నవీన్ కలిసి నటించారు. ఆ మూవీ షూటింగ్స్ సమయంలో వారు మంచి స్నేహితులుగా మారారు. ఆపై రహస్యంగా డేటింగ్ ప్రారంభించారు. ఈ వ్యవహారం చాముండేశ్వరికి తెలియడంతో ఇంట్లో వడ్డె నవీన్‌తో గొడవపడిందట.
రాశి విషయంలో ఇరువురి మధ్య తరచూ వాగ్వాదాలు జరగడంతో చాముండేశ్వరి వివాహ బంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారట. ఈ వార్తలు మీడియాలో వ్యాపించాయి. వారి విడాకులకు రాశి ప్రధాన కారణమని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. వడ్డె నవీన్ తండ్రి వడ్డె రమేష్ కూడా రాశిని కొడుకుకు దూరంగా ఉండమని హెచ్చరించాడు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది, లేక ఇవి గాసిప్లా అన్నది మాత్రం క్లారిటీ లేదు.