అన్నగారు ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాల్లో సిగరెట్లు తాగడం, మందు తాగడం సీన్లు ఉన్నాయి. అన్న గారికి ఎలానూ సిగరెట్లు తాగే అలవాటు ఉండడంతో గజదొంగ వంటి సినిమాల్లో ఈ సీన్లను అద్భుతంగా ఆయన పండించారు. అయితే.. జస్టిస్ చౌదరి సినిమాకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు.. బాలీవుడ్లో అప్పుడే కొత్తగా ట్రెండింగ్‌లోకి వచ్చిన.. పైపును తెలుగు తెరకు పరిచయం చేశారు.
ఇది.. కూడా దాదాపు పొగపీల్చడం వంటిదే. అయినా.. అన్నగారు ఎప్పుడూ.. పైపు తాగలేదు. దీంతో సడెన్‌గా రాఘవేంద్రరావు.. సినిమా సీన్లలో పైపు తాగే బిట్లు ఉన్నాయని అన్నగారికి చెప్పడంతో ఒక్కసారిగా అన్నగారు ఆశ్చర్యపోయారు. తనకు రాదని చెప్పారు. అదేముంది.. సిగరెట్ తాగినట్టే.. అని రాఘవేంద్రరావు లైట్ తీసుకున్నారు. కానీ.. సిగరెట్‌కు పైపుకు ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఇది ఫిల్టర్ చేయని పొగాకును వినియోగిస్తారు.
దీంతో అన్నగారు ఇబ్బంది పడ్డారు. ఇలా ఇబ్బంది పడుతూనే రెండు సీన్లు చేశారు. కానీ.. సరిగా రాలేదు. దీంతో రాఘవేంద్రరావు నొచ్చుకున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన అన్నగారు… తనకు రెండు రోజులు సమయం ఇవ్వమని అడిగిపైపు తాగడం నేర్చుకున్నారని గుమ్మడి రాసుకున్నారు. పైపుల్లోనూ అనేక రకాలు ఉంటాయని.. వీటి ఖరీదు కూడా ఎక్కువగా ఉంటుందని అన్నగారు తెలుసుకున్నట్టు చెప్పుకొచ్చారు.
మొత్తానికి పైపు తనకు పెద్ద కష్టమే తెచ్చి పెట్టిందని అన్నగారు అనేవారు. అయితే.. పైపు తాగడం అలవాట య్యాక.. ఆ సీన్లను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఇక, నిజ జీవితంలోనూ కొన్నాళ్ల వరకు అన్నగారు పైపు తాగిన విషయం చాలా గోప్యంగా ఉంచారు.