Newsసినిమాల్లోకి రాక‌ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస‌లు పేరు తెలుసా.. టాప్ సీక్రెట్‌..!

సినిమాల్లోకి రాక‌ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస‌లు పేరు తెలుసా.. టాప్ సీక్రెట్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు చెబితే టాలీవుడ్ పూనకాలతో ఊగిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన రెండో తమ్ముడు పవన్ కళ్యాణ్ తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తోనే పవన్ కళ్యాణ్ సంచలనం క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ లో ఏదో తెలియని ఆకర్షణ ఉందని తెలుగు సినీ ప్రేక్షకులకు అర్థమైంది. ఆ తర్వాత వరుసగా సూపర్ డూపర్ హిట్టులతో పవన్ మ్యాజిక్ క్రియేట్ చేశాడు.

పవన్ స్టైల్ కు యూత్ అంతా వెర్రెక్కిపోయింది. సినిమాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. 27 ఏళ్ల క్రితం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ గా మారాడు. ఆ తర్వాత వరుసగా గోకులంలో సీత – సుస్వాగతం – తొలిప్రేమ – బద్రి – ఖుషి సినిమాలతో పవన్ కళ్యాణ్ ముందు పవర్ స్టార్ బిరుదు వచ్చి చేరింది. పవన్ కు ఇప్పుడు ఎంతమంది అభిమానులు ఉన్నారో ? అప్పట్లో కూడా అంతే అభిమానులు ఉన్నారు.

గెలుపు ఓటములు.. హిట్లు.. ప్లాపుల‌తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు. పవన్ కళ్యాణ్ చేసింది 30 సినిమాలే అయినా 100 – 150 సినిమాలు చేసిన హీరోలకు ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో ? అంతకుమించిన అభిమానులు పవన్ సొంతం. పవన్ నటించిన సినిమాలలో గబ్బర్ సింగ్ – అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి.

పవన్ రాజకీయాల్లో కూడా వచ్చి జనసేన పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఇటు రాజకీయాలతో పాటు అటు సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు – సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓజీ – హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలలో నటిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news