Moviesఆ తప్పే సమంతను మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లేలా చేసిందా..? కర్మ...

ఆ తప్పే సమంతను మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లేలా చేసిందా..? కర్మ బూమారాంగ్ అయ్యిందే..!!

స్టార్ హీరోయిన్ సమంత ఎంత ఆక్టివ్ గా ఉంటుందో ఎంత ఫిజికల్ ఫిట్ గా ఉంటుందో మనకు తెలిసిందే. అయితే అలాంటి సమంత మయోసైటిస్ అనే ఓ భయంకరమైన అరుదైన వ్యాధికి గురైంది . ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకు వచ్చింది . అంతేకాదు సమంత ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి విదేశాలకు వెళ్లిపోయి ఆరు నెలల పాటు సుదీర్ఘంగా కష్టపడింది కాస్తో కూస్తో వ్యాధి నయం చేసుకొని ఇండియా తిరిగి వచ్చింది. మళ్లీ యధావిధిగా సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది .

అయితే తన బాడీని మరింత ఫిట్గా ఉంచడానికి వర్కౌట్స్ ఎక్కువగా చేసింది . ఈ కారణంగానే కావచ్చు మళ్లీ సమంత హాస్పిటల్ లో అడ్మిట్ అయింది . దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . తాజాగా మరోసారి హాస్పిటల్లో సమంత చేరిందా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సమంత తన హెల్త్ పై ఇంస్టాగ్రామ్ ద్వారా ఓ అప్డేట్ ఇచ్చింది . హాస్పిటల్ బెడ్ పక్కన సెలైన్ బాటిల్ ఉన్న ఫోటోను ఆమె స్టోరీలో పోస్ట్ చేసింది .

అంతేకాదు సమంతకు మళ్ళీ మయోసైటిస్ తిరగబడింది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఆమె హైదరాబాదులోని ఓ హాస్పిటల్ హెయిర్ క్లినిక్ ను ట్యాగ్ చేయడం ఇప్పుడు అందరికీ అనుమానంగా ఉంది . “నేరుగా నరాల్లోకి పోషకాలను పంపించడం అనేది కొన్ని మెడికల్ కండిషన్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు.. అయితే ఏ రోగాన్ని అయినా కేవలం ఐవి న్యూట్రిషనల్ తరఫున ఏం చేయలేదు. దీనిని ఒక కాంప్లిమెంటరీ చికిత్సగా భావించవచ్చు “అంటూ తాను సెలైన్ పెట్టుకోవడానికి గల కారణాన్ని పోస్టు ద్వారా సమంత చెప్పుకొచ్చింది . దీంతో సమంత ఆరోగ్యం పై మరింత టెన్షన్ పడుతున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news