ప్రస్తుతం తెలుగు బుల్లితెర టాప్ యాంకర్లలో ఎంతమంది ఉన్న శ్రీముఖికి క్రేజ్ వేరు. గలగల మాటలతో చెక్కేస్తుంది.. చకచకా షోను తిప్పేస్తుంటుంది. ఆమె బుల్లితెరపై ఒక షోను నడిపిస్తుంది అంటే చాలు కేవలం ఆమె కోసమే ఆమె షో చూసే లక్షల మంది ప్రేమికులు ఉన్నారు. ఎన్నో సినిమా ఫంక్షన్లకు, ఆడియో రిలీజ్.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో శ్రీముఖి చేసే సందడి అంతా ఇంతా కాదు.
శ్రీముఖి ఇటు బుల్లితెర నుంచి వెండితెర మీద కూడా ఎంట్రీ ఇచ్చేసింది. వెండితెరపై ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన ఆమె ఏకంగా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటించింది. చిరు పక్కన ఎంతో చలాకీగా శ్రీముఖి కనిపించింది. శ్రీముఖి వయసు ఇప్పటికే ముదిరిపోతోంది. గత మూడు నాలుగు ఏళ్లుగా శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నా అవేవీ నిజం కాలేదు.
తాజాగా ఆమె పెళ్లిపై ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె చాలాసార్లు హిట్లు ఇస్తూ వస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని ఆమె ఇంట్లో వాళ్లకు చెప్పడం.. ఇంట్లో వాళ్ళు ఎట్టకేలకు ఆ అబ్బాయి తోనే శ్రీముఖికి పెళ్లి చేసేందుకు ఓకే చెప్పటం జరిగినట్టు తెలుస్తోంది. శ్రీముఖి ప్రేమ ఇంట్లో వాళ్లకు ఎప్పుడో తెలిసినా వాళ్ళు మాత్రం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని.. అందుకే ఇంత ఆలస్యం అయిందని సమాచారం. త్వరలోనే శ్రీముఖి పెళ్లిపై అధికారిక సమాచారం, ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.