ఒక సినిమా అవుట్ పుట్ లో నేపథ్య సంగీతం చాలా కీలకపాత్ర పోషిస్తుంది. సినిమాలో సీన్లను ఎన్నో రెట్లు ఎలివేట్ చేస్తూ తర్వాత స్థాయికి తీసుకు వెళ్ళటం అందరికీ సాధ్యం కాదు. ఇటీవల జైలర్ సినిమాకు అనిరుధ్ ఎంతగా ప్రాణం పోసాడో స్వయంగా రజనీకాంత్ ఒప్పుకున్నాడు. తాను యావరేజ్ అనుకున్న సినిమా రీ రికార్డింగ్ తర్వాత బ్లాక్ బస్టర్ ఫీలింగ్ ఇచ్చిందని ఓపెన్ గా చెప్పారు. ఏమాటకు ఆమాట బాలయ్య అఖండ సినిమా రీ రికార్డింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఆ సినిమాలో బాలయ్య నటించిన హై లెవెల్ సీన్లను మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దటంలో తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం చాలా హైలెట్గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా విజయంలో తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం అద్భుతం అని చెప్పాలి. థియేటర్లలో అఖండ సినిమా చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే కేవలం తమన్ నేపథ్య సంగీతం అని చెప్పాలి.
అయితే ఇటీవల అఖండ దర్శకుడు బోయపాటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అఖండలో హైలెవల్ సీన్లు బిజిఎం లేకుండా చూసిన అదే గూస్‌బంప్స్ వస్తాయని.. అంత గొప్పగా తాను తీశానని ప్రత్యేకించి తమన్ వల్ల యాడ్ అయిందేమీ లేదన్నట్టు మాట్లాడారు. ఇది సహజంగానే ఎవరికి నచ్చలేదు. దీనిపై నేరుగా స్పందించని తమన్ అరవింద సమేత సినిమాకు ఇచ్చిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
దీనిని గుర్తు చేసుకుంటూ ఈ సినిమాకు కేవలం 40 రోజుల్లో అద్భుతమైన మ్యూజిక్‌తో పాటు నేపద్య సంగీతం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడో ఐదేళ్ల క్రితం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన అరవింద ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఇప్పుడు షేర్ చేయడం వెనక పరోక్షంగా తమ బోయపాటికి కౌంటర్ వేశాడని అంటున్నారు.
అలాగే పనిలో పనిగా గుంటూరు కారం సినిమా నుంచి తమన్‌ను తప్పించాలని మహేష్ ఎన్నో ప్రయత్నాలు చేశాడని.. కేవలం త్రివిక్రమ్ కోసమే తమను మహేష్ బాబు కొనసాగిస్తున్న ప్రచారం కూడా జరుగుతుంది. తనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎంత మంచి మ్యూజిక్ ఇస్తానో అని చెప్పేందుకు మహేష్ బాబుకు కూడా తమన్ కౌంటర్ వేసినట్టుగా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.