టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ ఫెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని హీరో నాగ చైతన్య. వీరిద్దరూ విడాకులు తీసుకుని దాదాపు రెండేళ్లు అవుతోంది. పెళ్లయిన నాలుగేళ్లు మాత్రమే కలిసి ఉన్న ఈ జంట విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. వీరిద్దరు విడిపోవటాన్ని వారి అభిమానులు ఇప్పటికీ ఎప్పటికీ జీర్ణించుకోలేని విధంగా ఉన్నారు.
ఇటీవల నాగచైతన్య – సమంత మళ్లీ కలుసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా నాగచైతన్య దగ్గర సమంత పెట్ డాగ్ హష్ కనిపించడంతో వారిద్దరు మళ్ళీ కలుస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ మొదలైంది. ఇటు సమంత.. అటు నాగచైతన్య అభిమానులు కూడా వీరిద్దరూ కలిసి మళ్ళీ కాపురం చేసుకుంటే బాగుంటుందని కామెంట్లో పెడుతున్నారు. ఇలాంటి టైంలో సమంత అదిరిపోయే షాక్ ఇచ్చింది.
ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. పింక్ డ్రెస్ లో సమంత తన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. గతంలో సమంత షేర్ చేసిన ఫోటోలలో సమంత బాడీపై అక్కినేని నాగచైతన్య టాటూ ఉండేది. ఈసారి షేర్ చేసిన ఫోటోలో చైతు టాటూ కనిపించలేదు. దీనికి తోడు పింక్ డ్రెస్‌లో మరింత విచ్చలవిడిగా అందాలు ఆరబోసేసింది.
దీంతో ఇప్పుడిప్పుడే మళ్ళీ కలుస్తారు అని వీరిద్దరి గురించి మొదలైన చర్చకు వెంటనే బ్రేక్ పడిపోయింది. సామ్ నిజంగానే తన బాడీ పై ఉన్న చైతు టాటూ తొలగించుకుందా ? లేదా ఉద్దేశపూర్వకంగానే కనిపించకుండా జాగ్రత్త పడిందా అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. సమంత ఫోటోలు బయటకు రావడంతో అందరూ చైతు టాటూ లేకపోవడంతో సమంతతో కలిసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చిందని గుసగుసలాడుకుంటున్నారు.