Newsటివి ఛానెళ్లు.. యూట్యూబ్ ఛానెల్స్ ను ఎండగట్టిన నాని.. వీడు మగాడ్రా...

టివి ఛానెళ్లు.. యూట్యూబ్ ఛానెల్స్ ను ఎండగట్టిన నాని.. వీడు మగాడ్రా బుజ్జి..!

అనవసరమైన విషయాల పట్ల నానా రాద్ధాంతం చేస్తున్న కొన్ని టివి ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెల్స్ మీద ప్రేక్షకులు విసుగు చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్టార్ హీరోలు నోరు విప్పేందుకు సుముఖత చూపలేదు. ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని విషయాల పట్ల కొందరు కావాలని దుమ్మెత్తిపోయడం జరుగుతుంది.

అయితే దీనిపై స్పందిస్తూ నాచురల్ స్టార్ నాని ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టివి ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లు చేస్తున్న ఓవర్ యాక్షన్ కు నాని ఫైర్ అయ్యాడు. వాటిని ఖండిస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు. ఎలాంటి నిరాధారం లేని వార్తలను, అనవసర డిస్కషన్స్ పెడుతున్న యూట్యూబ్ ఛానెళ్లను తన అసహనం ప్రకటించాడు నాని. మీడియా అనేది ఫ్యూచర్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. పిల్లలు చూస్తున్నారు.. ఇక చాలు ఆపండి అంటూ మంచి ఫైర్ మీద ట్వీట్ చేశాడు నాని.

నాని ట్వీట్ చేసిన విధానం చూస్తే.. ఇండస్ట్రీ మీద దుమ్మెత్తిపోస్తున్న కొందరి గురించి అని చెప్పకనే చెప్పొచ్చు. ముఖ్యంగా రెండు వారాల నుండి అయితే శ్రీ రెడ్డి, లేదంటే మాధవిలతలతో చర్చా వేదికలను పెట్టి అనవసర రాద్ధాంతం చేస్తున్న విషయం మీదనే నాని ఈ ట్వీట్ చేసి ఉంటాడని అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news