Moviesరోషన్ హాట్ రొమాన్స్ పై రాజీవ్ టంగ్ స్లిప్.. నోరు మూయించిన...

రోషన్ హాట్ రొమాన్స్ పై రాజీవ్ టంగ్ స్లిప్.. నోరు మూయించిన సుమ..అంత మాట అనేసింది ఏంటి..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్స్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా చిన్న ఏజ్ లోనే చూడకూడని దృశ్యాలు చూడాల్సి వస్తుందే అంటూ బాధపడుతుంటే .. మరికొందరు చిన్న వయసులోనే చేయకూడని పనులు కూడా చేయిస్తున్నారు. డైరెక్టర్ తాజాగా సుమ కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే .

బబుల్ గమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు సుమ కొడుకు రోషన్ . ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే ఈ టీజర్ లో సుమ కొడుకు రోషన్ కూసింత హద్దులు మీరిపోయాడు ..హగ్గులు , ముద్దులు, కొరకడాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇదే విషయంపై స్టేజ్ పైకి వచ్చిన రోషన్ తండ్రి రాజీవ్ కనకాల మాట్లాడుతూ ..” ఇదివరకు ఎవరైనా కనకాల అని పిలవగానే .. నన్నే అనుకోని నిలబడి వెళ్లిపోయేవాడిని .. అయితే ఈరోజు రోషన్ కనకాల అని పిలిస్తే నన్నే అనుకోని నేను లేచేసాను. ఆ తర్వాత అర్థమైంది .. నన్ను కాదు అని ఈ స్థాయికి నేను రావడానికి .. చాలా చాలా సంతోషంగా ఉన్నాను .. టీజర్ చూస్తుంటే రోషన్ బాగా చేసినట్లే అనిపిస్తుంది .. చివరకి షూట్ చూసి అంటూ దీర్ఘం తీస్తూ స్పీచ్ ను ఆపేశారు ..

దీనితో పక్కనే ఉన్న సుమ వచ్చి రాజా మనం కొన్ని మాట్లాడకుండా.. ఉంటేనే బెటర్ అంటూ నవ్వుతూ కామెంట్ చేసింది . నోరు మూయించేసింది.. దీంతో అక్కడున్న జనాలు సైతం నవ్వుకున్నారు . అంతేకాదు జనాల ఒపీనియన్ కూడా ఇదే. ఫస్ట్ సినిమాకే ఇంత హైడోస్ అవసరమా..? అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . చూడాలి మరి ఈ సినిమా హిట్ అవుతుందో ఫట్ అవుతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news