నాగార్జున – మోహనరాజ ఈ కాంబినేషన్ పై డిస్కషన్ ఇప్పటిది కాదు. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా స్టార్ట్ చేయక ముందు నుంచి ఉంది. అసలు గాడ్ ఫాదర్ సినిమా కోసం మోహనరాజాను స్వయంగా నాగార్జున మెగా కాంపౌండ్ కు పంపించాడని టాక్ కూడా అప్పట్లో నడిచింది. గాడ్ ఫాదర్ తర్వాత నాగార్జున సినిమా పై మోహన్ రాజా వర్క్ ప్రారంభిస్తాడని అందరూ అనుకున్నారు. నాగార్జున వందో సినిమాకు కూడా అతడే డైరెక్టర్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ డిస్కషన్ నుంచి మోహన్ రాజా పేరు సైడ్ అయిపోయింది.
తన వందో సినిమా కోసం ఛాన్స్ ఇస్తానని మూడు నాలుగు ఏళ్లుగా మోహన్ రాజాతో చర్చలు జరుపుతున్నాడు నాగార్జున. అయితే ఇప్పుడు మోహన్ రాజాను పక్కన పెట్టేసి ఓ తమిళ దర్శకుడితో నాగార్జున చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అతడు ఎవరో కాదు నవీన్.. ఇప్పటికే నాగార్జునకు రెండు మూడు స్టోరీ లైన్ లు చెప్పగా అందులో ఏదో ఒకటి నాగార్జున వందో సినిమా అవుతుందని తెలుస్తోంది.
నవీన్ కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్ కాదు అప్పుడెప్పుడో 2013లో ఒక సినిమా తీశాడు. ఆ సినిమాకు నిర్మాత, దర్శకుడు, రచయిత కూడా.. అందులో ఓ పాత్ర కూడా పోషించాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మధ్యలో విజయ్ ఆంటోనీతో ఒక సినిమా ఓకే చేసినా అది కూడా ఆగిపోయింది. అలాంటి డైరెక్టర్ తో నాగార్జున వందో సినిమా చేస్తుండటం ఎవరి అంచనాలకు అందటం లేదు. మరి మోహన రాజా ఏమయ్యాడు ? నాగార్జున వందో సినిమా కోసం చూసి చూసి విసిగిపోయిన ఆయన తన తమ్ముడు జయం రవిని హీరోగా పెట్టి తని వరువన్ 2 ( తెలుగులో ధ్రువ ) పేరుతో సినిమాను ఎనౌన్స్ చేశాడు.
దీంతో చాలామందికి విషయం అర్థమైంది. ఏది ఏమైనా మూడేళ్ల పాటు నాగార్జున సినిమా కోసం ఎదురుచూసి చూసి చివరకు మోహనరాజా తమ్ముడుతో సినిమా మొదలుపెట్టాడు. ఇక నాగార్జున విషయానికి వస్తే విజయ్ బిన్ని దర్శకత్వంలో నా సామిరంగా పేరిట తన 99వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.