బాలయ్య అభిమానులతో పాటు తెలుగు సినిమా అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా భగవంత్ కేసరి. తాజాగా ఈ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా మీద మొదటి నుంచి ప్రేక్షకులకు చాలా సందేహాలు ఉన్నాయి. బాలయ్య స్టైల్ వేరు.. అనిల్ రావిపూడి స్టైల్ వేరు.. బాలయ్యది మాస్ యాక్షన్ స్టైల్.. అనిల్ రావిపూడి కామెడీ స్టైల్.. మరి వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడంతో ఎవరి స్టైల్ లోకి ఎవరు? వస్తారా అన్నదే ఆ అనుమానం.
తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే ఈ రెండు విషయాలను పక్కన పెట్టేశాడు అనిల్ రావిపూడి.
అటు దర్శకుడు.. ఇటు బాలయ్య ఇద్దరు కొత్తగా జనాల్లోకి అడుగుపెట్టినట్టుగా కనిపిస్తోంది. బాలయ్య పాత్ర చూస్తుంటే పెద్దరికం సంతరించుకున్న తండ్రి పాత్రలో కనిపించారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఒకటే విధంగా మిడిల్ లుక్ లోనే ఉన్నారు. కూతురిని బలంగా పోరాటానికి సిద్ధం చేసి తీరాలన్న బలమైన సంకల్పం బాలయ్య పాత్రలో కనిపించింది.
అయితే దీని వెనక ఏం విషయం దాగి ఉంది ? అన్నది మాత్రం ట్రైలర్లో చూపించలేదు. అలాగే విలన్‌తో బాలయ్యకు ఎందుకు గొడవ వచ్చింది ? అన్నది కూడా ట్రైలర్లో క్లారిటీ ఇవ్వలేదు. ట్రైలర్ మొత్తం బాలయ్య, విలన్ అర్జున్ రాంపాల్ , శ్రీలీల మీద రన్ చేశారు. కాజల్ పాత్రను జస్ట్ అలా చూపించారు.
ఇక డ్యూయెట్ లాంటి రొటీన్ స్టాప్ కి కూడా ట్రైలర్ లో చోటు ఇవ్వలేదు.
మొత్తం మీద చూస్తే బాలయ్య తరహా యాక్షన్ కొనసాగిస్తూనే బాలయ్యను కొత్తగా చూపించే ప్రయత్నం జరిగినట్టుగా తెలుస్తోంది కదా.. ! మరి సినిమా ఎలా ఉండబోతుంది అన్నది ట్రైలర్ లో రివీల్ చేయలేదు. మొత్తానికి ట్రైలర్ తో చాలా సస్పెన్షన్ పెట్టి అనిల్ రావిపూడి అలాగే వదిలేశారు. సాహూ గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న భగవంత్ కేసరి దసరా కానుకగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.