Moviesవరుణ్-లావణ్యల పెళ్లి వేదిక ఫిక్స్.. మోస్ట్ మోస్ట్ స్పెషల్ ప్లేస్ లోనే..!!

వరుణ్-లావణ్యల పెళ్లి వేదిక ఫిక్స్.. మోస్ట్ మోస్ట్ స్పెషల్ ప్లేస్ లోనే..!!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఫైనల్లీ నాగబాబు నివాసంలో నిశ్చితార్ధం చేసుకొని తమ ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది . అప్పటినుంచి వరుణ్ లావణ్య పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి .

కాగా రీసెంట్గా వీళ్ళ పెళ్లి నవంబర్ 1వ తేదీ జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు రీసెంట్గా జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ గా మారాయి. ఇలాంటి క్రమంలోనే మెగా కోడలు ఉపాసన వరుణ్ లావణ్య పెళ్లి జరగబోతున్న ప్లేస్ ని పరోక్షంగా వెల్లడించింది . లావణ్య వరుణ్ ఇటలీలోని టస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఉపాసన కూడా ఇదే విషయాన్ని కన్ఫామ్ చేసింది . మెగా ఫ్యామిలీతో ఇక్కడికి మేము వచ్చాము అంటూ క్యాప్షన్ చేసింది . దీనితో వరుణ్ లావణ్య పెళ్లి అక్కడే జరగబోతున్నట్లు అర్థమవుతుంది . అంతేకాదు ఇటలీలోనే ఇది చాలా చాలా ఫేమస్ ప్లేస్ గా తెలుస్తుంది . అంతేకాదు ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా సంతోషంగా లైఫ్ లో ముందుకు తీసుకెళ్తున్నారట . మొత్తానికి వరుణ్ లావణ్య వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్ గా మారిపోయాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news