ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుణ్ లావణ్య ల పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఇలాంటి క్రమంలోని త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్న వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో జరిగిన తప్పు మరోసారి నెట్టింట వైరల్ గా మారింది . రీసెంట్గా చిరంజీవి నివాసంలో వరుణ్ లావణ్య వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి .
ఈ వేడుకకు మెగా – లావణ్య కుటుంబం హాజరయ్యారు . అయితే మెగా ఫ్యామిలీలో ఎంతో ఇంపార్టెంట్ అయిన అల్లు అర్జున్ – అల్లు అరవింద్ జంటలు ఈ ఫంక్షన్ లో మిస్ అయ్యారు . అంతేకాదు చాలామంది ఈ ఫంక్షన్ కి ఫస్ట్ రాము అంటూ బిజీగా ఉన్నాము అంటూ హ్యాండ్ ఇచ్చారట. దీంతో లాస్ట్ మినిట్ లో మెగాస్టార్ చిరంజీవి వాళ్ళందరికీ ఫోన్ చేసి మీరు కచ్చితంగా ఈ ఫంక్షన్ కి అటెండ్ అవ్వాలి అంటూ స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారట .
అంతేకాదు మనమందరం కలిసేది ఎప్పుడో ఒకసారి .. ఇలాంటి ఫంక్షన్స్ కూడా మీరు మిస్ అయితే ఇంకెందుకు సెలబ్రేషన్స్ చేసుకోవడం అంటూ ఫుల్ రేంజ్ లో ఫైర్ అయిపోయారట . దీంతో మెగా హీరోలు చిరంజీవి కోపానికి బలైపోయారు అన్న న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది . అంతేకాదు అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి – అల్లు అరవింద్ రాకపోవడం పై లావణ్య కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది . మొత్తానికి మెగా – అల్లు మధ్య ఏదో వార్ నడుస్తుంది అంటూ పరోక్షకంగా హింట్ వచ్చేసింది..!!