అల్లు అర్జున్ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఆర్య. దర్శకుడు సుకుమార్ తొలి సినిమాతోనే తిరుగులేని ఘన విజయం అందుకున్నారు. వన్ సైడ్ లవ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో 2004 సమ్మర్ కానుకగా కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. దేవిశ్రీప్రసాద్ అందించిన స్వరాలు మంచి సక్సెస్ అయ్యాయి. శివబాలాజీ మరో హీరోగా నటించారు.
ఆర్య సూపర్ హిట్ అయ్యాక సుకుమార్.. రామ్ హీరోగా జగడం సినిమా తీశారు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. అయితే జగడం సినిమాను సుకుమార్ ముందుగా మహేష్ బాబు, ఆ తర్వాత అల్లు అర్జున్ తో తీయాలని అనుకున్నారు. అయితే అల్లు అర్జున్ దిల్ రాజుతో జరిగిన చిన్న గొడవ కారణంగా రామ్‌తో తీయాల్సి వచ్చింది. సుకుమార్ ఇటు దిల్ రాజుకు.. అటు బన్నీకి కథ చెప్పారు. అయితే ఇద్దరూ కూడా కథలో ఏదో కాస్త కన్ఫ్యూజ్ ఉంది.. ఇది ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాదేమో అని చెప్పడంతో సుకుమార్ కు పట్టరాని కోపం వచ్చిందట.
అప్పటికే ఆర్య హిట్ అవడంతో సుకుమార్ గాల్లో తేలిపోతున్న రోజులు అవి. తాను హిట్ ఇచ్చిన హీరో, నిర్మాత తన కథ నచ్చలేదని చెప్పడంతో సుకుమార్ ఆవేశం కట్టలు తెంచుకుంది. మీరు ఛాన్స్ ఇవ్వకపోతే నా కథకు హీరో దొరకడా..! అని రాత్రికి రాత్రి రామ్‌ను హీరోగా పెట్టి సినిమా ఎనౌన్స్ చేసేసారు. విచిత్రం ఏంటంటే మరుసటి రోజు ముహూర్తం పెట్టి దిల్ రాజును – బన్నీని కూడా ఆ సినిమా ప్రారంభోత్సవానికి పిలిచాడట సుకుమార్. చివరకు బన్నీ – దిల్ రాజు జడ్జిమెంట్ నిజం అయింది. జగడం సినిమా డిజాస్టర్ అయింది.
అయితే తర్వాత అదే బన్నీతో సుకుమార్ ఆర్య 2.. రీసెంట్గా పుష్ప సినిమా తీశాడు. పుష్ప పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ కాగా.. ఇప్పుడు పుష్ప కు సీక్వెల్‌గా పుష్ప 2 వస్తోంది.