Newsబంగ్లాదేశ్ జ‌నాలు భోరున ఏడ్చేస్తూ బ్లాక్‌బ‌స్ట‌ర్ చేసిన వెంక‌టేష్ సినిమా ఇదే..!

బంగ్లాదేశ్ జ‌నాలు భోరున ఏడ్చేస్తూ బ్లాక్‌బ‌స్ట‌ర్ చేసిన వెంక‌టేష్ సినిమా ఇదే..!

కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరైన స్టార్ హీరో వెంకటేష్. అప్పట్లో వెంకటేష్ తీసిన చాలా సినిమాలు మహిళా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసేవారు. ఒకవైపు అటు వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూనే.. ఇటు అందరినీ ఆకట్టుకునేలా సినిమాలు చేస్తూనే విభిన్న పాత్రలను ఎంచుకుంటూ కెరియర్లో ముందుకు సాగారు. అలా వెంకటేష్ కెరీర్ లో నటించిన విభిన్న కథా చిత్రం పవిత్రబంధం.

విదేశాల్లో పెరిగిన యువకుడికి జీవితం ప్రేమ అంటే ఏమిటో ? తెలియజెప్పిన సినిమా ఇది. ఈ సినిమాలో హీరోగా వెంకటేష్ అతడి తండ్రి విశ్వనాథ్‌గా ఎస్పీ బాలసుబ్రమణ్యం నటించారు. తండ్రి మాట కాదనలేక వెంకటేష్ సౌందర్యని పెళ్లి చేసుకుంటాడు. అది కూడా ఏడాది పాటు కాంట్రాక్టు మ్యారేజ్. ఆ తర్వాత ఎవరిదారి వారిది.. కుటుంబ పరిస్థితులు వల్ల విజయ్ పెట్టిన షరతులకు ఒప్పుకుని రాధ‌ కాంట్రాక్ట్ వివాహం చేసుకుంటుంది.

ఈ ఏడాది కాలంలో విజయలో ఎలాంటి మార్పు వచ్చిందనేది మిగిలిన కథ. ఇలాంటి సబ్జెక్ట్ చేయడం అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న వెంకటేష్ కు పెద్ద రిస్కే.. కానీ వెంకటేష్ కథ విన్న వెంటనే అంగీకరించి సినిమా చేయటం విశేషం. ఈ సినిమాలో ఫస్ట్ నైట్ లో సీన్లు సౌందర్య వెంకటేష్ కాళ్లకు నమస్కరిస్తుంది.. ఆమె పైకి లేవ‌గానే వెంకటేష్ కూడా కిందకి వంగి ఆమె కాళ్లు కామస్కరిస్తాడు.

ఇదే స్టిల్ 24 షీట్ పోస్ట‌ర్ వేస్తే అది బాగా వైర‌ల్ అయ్యింది. ముత్యాల సుబ్బ‌య్య ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమా తెలుగులో సూప‌ర్ హిట్ అయ్యాక ఆరు భాష‌ల్లో రీమేక్ చేస్తే అన్ని భాష‌ల్లోనూ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టింది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, ఒరియా, హిందీ, బెంగాలి భాష‌ల్లో రీమేక్ చేశారు. విచిత్రం ఏంటంటే ప‌విత్ర‌బంధం సినిమాను మ‌న దేశంలోని ప్రాంతీయ భాష‌లే కాకుండా.. బంగ్లాదేశ్‌లో బంగ్లా భాష‌లో కూడా రిలీజ్ చేస్తే అక్క‌డ జ‌నాలు థియేట‌ర్ల‌లో ఈ సెంటిమెంట్‌కు క‌న్నీళ్లు పెట్టుకుని మ‌రీ సూప‌ర్ హిట్ చేశారు.

తెలుగులో ఉత్త‌మ సినిమాగా ప‌విత్ర‌బంధంకు బంగారు నంది అవార్డు వ‌చ్చింది. ఉత్త‌మ న‌టిగా సౌంద‌ర్య‌, ఉత్త‌మ స‌హాయ‌న‌టిగా ఎస్పీ బాలుకు నంది అవార్డులు వ‌చ్చాయి. ఈ సినిమా ఇప్పుడు టీవీల్లో వ‌చ్చినా కూడా అదిరిపోయే టీఆర్పీలు బ‌ద్ద‌లు కొడుతూ ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news