Newsమెగా బ్లాక్‌బ‌స్ట‌ర్ ' ఠాగూర్‌ ' కు వినాయ‌క్ కంటే ముంద‌నుకున్న...

మెగా బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ ఠాగూర్‌ ‘ కు వినాయ‌క్ కంటే ముంద‌నుకున్న స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రు ? చిరు ఎందుకు ప‌క్క‌న పెట్టాడు ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవి కెరీర్ అయిపోయింది అన్న విమర్శలు వచ్చిన టైంలో 2002లో వచ్చిన ఇంద్ర సినిమా చిరంజీవి స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది. ఆ రోజుల్లోనే రు. 25 కోట్లకు పైగా షేర్ తో పాటు 122 కేంద్రాలలో వంద రోజులు ఆడి అప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న ఇండస్ట్రీ రికార్డులు అన్నింటికీ పాతరేసింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి మళ్లీ హిట్ సినిమా చేయాలని కసితో ఉన్నారు.

అనేక కథలు విన్నారు. అదే టైంలో తమిళంలో విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కిన రమణ సినిమా గురించి ఆయన విని.. ఆ సినిమా చూడడంతో పిచ్చపిచ్చగా నచ్చేసింది. సామాజిక అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కించిన తీరు తమిళ‌ జనాలకు పిచ్చపిచ్చగా నచ్చేయడంతో అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. రీమేక్ హక్కులు కూడా తీసుకున్నారు. దర్శకుడుగా మురుగుదాస్‌నే అనుకున్నారు.

మురుగదాస్ మాత్రం ఓ కండిషన్ పెట్టారు. తాను పాటలు లేకుండా సినిమా తీస్తానని.. అందులోను క్లైమాక్స్‌లో హీరో చనిపోతాడని.. దానిని మార్చలేనని చెప్పారు. అయితే తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చాలంటే పాటలు ఉండాల్సిందే అని.. క్లైమాక్స్ కూడా హీరో చనిపోకుండా ఉండాలని చిరంజీవి పట్టుపట్టారు. ఇందుకు మురుగదాసు ఒప్పుకోలేదు. ఆ తర్వాత చిరు మురుగ‌దాస్‌ను వ‌దిలేసి రాజా రవీంద్ర తో వినాయక్‌కు కబురు పంపారు. వినాయక్‌ని ఈ సినిమా చూడమని చెప్పడంతో పాటు పాటలు, క్లైమాక్స్ మార్చాలని సలహా ఇచ్చారు.

అలా స్వయంగా చిరంజీవి వినాయక్‌కు ఈ ఆఫర్ ఇచ్చారు. తాను చెప్పిన కండిషన్లకు మురుగదాస్‌ ఒప్పుకోకపోవడంతో చిరంజీవి స్వయంగా ఆయన ప్లేస్ లో వినాయక్‌ని తీసుకువచ్చారు. వినాయక్‌ ఠాగూర్ ను అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కించారు. సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ రోజుల్లోనే 192 కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది. చిరంజీవికి ఇంద్ర తర్వాత వరుసగా మరో సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news