ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే ఆసక్తి చూపేవారు.. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే ఇటు సౌత్ సినిమా పరిశ్రమతో పాటు అటు బాలీవుడ్ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది. ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే జనతా గ్యారేజ్ పక్క లోకల్ సినిమా. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో ఉన్న స్పెషల్ సాంగ్ పక్కా లోకల్ ఎంత పెద్ద హిట్ అయిందో.. సినిమా కూడా అంతే సూపర్ డూపర్ హిట్. జనతా గ్యారేజ్ కథ వేరు.. అప్పటి ఎన్టీఆర్ ఇమేజ్ వేరు. ఇక కొరటాల తన కెరీర్ లో చేసిన జనతా గ్యారేజ్ – శ్రీమంతుడు – భరత్ అనే నేను – మిర్చి అన్ని కూడా కేవలం టాలీవుడ్ ప్రేక్షకులకు.. వారి అభిరుచికి అనుగుణంగా తీసిన సినిమాలే.
ఆచార్య పాన్ ఇండియా సినిమా అంటూ ప్రచారం చేసినా అతి పెద్ద డిజాస్టర్ అయింది. అసలు ఆచార్య కథ పాన్ ఇండియాకు ఏమాత్రం సూట్ కాదు. అయితే ఇప్పుడు దేవరతో కొరటాల శివ కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా సబ్జెక్టుతో భారీ రిస్క్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏకంగా ఏడాదికి పైగా టైం తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకోవాలని కొరటాల గట్టి కసరత్తులు చేస్తున్నాడు.
అందుకే జాన్వి కపూర్ లాంటి బాలీవుడ్ హీరోయిన్.. అనిరుధ్ రవిచంద్రన్‌ను మ్యూజిక్ డైరెక్టర్ గా సెట్ చేశాడు. ఇక స్పెషల్ సాంగ్ కోసం కృత్రిసనన్‌తో చర్చలు జరుగుతున్నాయి. దేవర కోసం కెరీర్ లో ఫస్ట్ టైం భారీ రిస్క్ చేస్తున్న కొరటాల ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.