Newsఫ్యీజులు ఎగిరి.. పూన‌కాలు తెప్పించే న్యూస్‌.. ' స‌లార్ ' ట్రైల‌ర్...

ఫ్యీజులు ఎగిరి.. పూన‌కాలు తెప్పించే న్యూస్‌.. ‘ స‌లార్ ‘ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ స‌లార్‌. బాహుబలి సిరీస్ సినిమాలు, సాహో, రాధేశ్యామ్‌, ఆది పురుష్‌ సినిమాలతో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇటు కేజీఎఫ్ సిరీస్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశాంత్ పేరు మారుమోగుతుంది.

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సలార్ సినిమాపై ఆకాశాన్ని దాటిపోయే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సలార్ 1 సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. అనివార్య‌ కారణాలవల్ల సలార్‌ను డిసెంబర్ 22 కు నిర్మాతలు పోస్ట్ పోన్ చేశారు. ఇక సినిమా ఎలాగూ వాయిదా పడింది.. ఇప్పుడు ట్రైలర్ కట్ కోసం నేషనల్ వైడ్‌గా ఉన్న సినీ ప్రేమికులు అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్ అవుతుందనేది ఆసక్తిగా మారింది. ఇక ప్రభాస్ అభిమానులకే కాకుండా ఇండియన్ సినిమా జనాలకు ఈ బిగ్గీ యాక్షన్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ? అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా ఈ అక్టోబర్ 23న ప్రభాస్ సలార్ 1 ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు.

ఏది ఏమైనా ప్రభాసు బర్త్ డేకి సలాడ్ ట్రైలర్ పెద్ద బ్లాస్ట్ అవ్వనిందని చెప్పాలి. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా… రవి బ్ర‌సూర్ సంగీతం అందిస్తున్నారు. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరంగాదూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news