News20 సినిమాలు చేస్తే ఒక్క హిట్‌తో స‌రిపెట్టుకున్న ఈ తెలుగు హీరోయిన్‌ను...

20 సినిమాలు చేస్తే ఒక్క హిట్‌తో స‌రిపెట్టుకున్న ఈ తెలుగు హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా..!

సినిమా రంగంలో నిలదొక్కు కోవాలంటే హీట్ కంపల్సరీ. అలా లేకపోతే మనలను ఎవరూ ? పట్టించుకోరు. హీరోయిన్ల విషయానికి వస్తే గ్లామర్ తో పాటు నటన పరంగా సూపర్ గా ఉండి.. అద్భుతమైన బ్లాక్‌బ‌స్టర్లు కొడితేనే క్రేజ్ ఉంటుంది. ఎంత అందం ఉన్నా ? నటనపరంగా బాగున్నా హిట్లు లేకపోతే చాలామంది కనుమరుగైపోతూ ఉంటారు. ఒక బ్యూటీ కూడా అలాగే పేడవుట్ అయిపోయింది. పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా. ఆమె పియా బాజ్‌పాయ్.

ఉత్తరప్రదేశ్లోని ఎతావోలో పుట్టిన ఈమె ఢిల్లీలో సెటిల్ అయింది. సినిమాల్లోకి వెళ్తానంటే తల్లిదండ్రులు తిట్టారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ముంబైకి మకాంమార్చి సీరియల్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది. అది బోర్ కొట్టాక మోడలింగ్ లోకి వచ్చి ఆ తర్వాత అమితాబ్ – ధోని లాంటి వాళ్ళు పక్కన యాడ్స్ లో నటించింది. అలా యాడ్స్‌ చేస్తున్నప్పుడే సౌత్ డైరెక్టర్ ప్రియదర్శన్‌ దృష్టిలో పడింది.. ఆయన డైరెక్ట్ చేసిన యాడ్‌లో పియాకు మంచి పేరు వచ్చింది.

2008లో తమిళంలో పోయి సొల్ల పోరం సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత ఏడాది నిన్ను కలిసే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత‌ నాలుగైదు సినిమాలు చేసిన అన్ని ప్లాప్ అయ్యాయి. అయితే జీవా హీరోగా వచ్చిన రంగం ( త‌మిళం కో) సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో తెలుగు, తమిళంలో పియా పేరు మార్మోగింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టలేదు.

అలా 2008 – 2018 మధ్యలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో చాలా సినిమాలు చేసింది. మొత్తం 30 సినిమాలు చేసిన ఆమె కెరీర్లో రంగం ఒక్కటి మాత్రమే మంచి హిట్గా నిలిచింది. ఆ తర్వాత ఆమెను పట్టించుకోవటం కూడా మానేశారు. ఈ ఏడాది ఓటీటీలో రిలీజ్ అయిన హిందీ సినిమా లాస్ట్ లో క్యారెక్టర్ న‌టిగా చేసింది. నటిగా ప్రియా ఫామ్ లో లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ రెచ్చిపోతూ ఉంటుంది. ఆమె ఫోటోలు చూస్తేనే ఆ విషయం మీకు క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news