ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్. భారతదేశ సినీ ప్రియులకు సరికొత్త టేకింగ్ ఎలా ఉంటుందో ? రుచి చూపించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు.
అలాగే పొగరు సినిమాలో లేడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియారెడ్డి కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసింది. ఈ భారీ యాక్షన్ డ్రామా షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 28న రిలీజ్ కావలసి ఉన్నా డిసెంబర్ 22 కు వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ సినిమాపై కొద్ది నెలల నుంచి ఒక అనుమానం ఉంది.
గతంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఉగ్రం సినిమాకు రీమేక్ అని వార్తలు వచ్చాయి. అయితే ఎన్నో నెలల క్రితం ఈ సినిమా సంగీత దర్శకుడు రవి బ్రసూర్ సలార్ గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ వీడియోలో రవి మాట్లాడుతూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రంకు సలార్ రీమిక్ గా వస్తుందని చెప్పాడు. ఆ వీడియోలో ఆయన ఏ ఉద్దేశంతో ?చెప్పారో క్లారిటీ లేదు.. కానీ ఉగ్రం సినిమా చూసిన వారికి ఆ మూవీ లైన్ చూస్తే సలార్ తో కొంత సంబంధం ఉన్నట్టు కనిపిస్తోంది.
ఉగ్రం సినిమా పోస్టర్ సలార్ సినిమా పోస్టర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. కన్నడంలో ఉగ్రం సినిమా భారీ హిట్ కొట్టింది. మళ్ళీ ఇదే సినిమాను రీమేక్ గా ప్రశాంత్ ఎందుకు తీస్తాడు ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. యూట్యూబ్లో ఉన్న ఉగ్రం సినిమాకు 50 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రసూర్ స్వయంగా ఉగ్రంకు రీమేక్ గా సలార్ వస్తుందని చెప్పడంతో ప్రభాస్ అభిమానుల్లో కాస్త టెన్షన్ అయితే ఉందని చెప్పాలి.