Movies"చచ్చినా అలా చేయకూడదు అనుకున్న..కానీ,తప్పలేదు"..అసలు నిజం బయటపెట్టిన అనుపమ..!!

“చచ్చినా అలా చేయకూడదు అనుకున్న..కానీ,తప్పలేదు”..అసలు నిజం బయటపెట్టిన అనుపమ..!!

మలయాళి కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందానికి అందం .. నటనకి నటన ..రెస్పెక్ట్ కి రెస్పెక్ట్.. అల్లరితనానికి అల్లరితనం అన్ని కలగలిసిన ఓ అందాల ముద్దుగుమ్మ . నేటి యువత అమ్మాయి ఎలా ఉండాలి అంటూ ఎక్స్పెక్ట్ చేస్తుందో అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అనుపమ పరమేశ్వరణ్. కాగా కెరియర్ స్టార్టింగ్ లో చాలా పద్ధతిగా రోల్స్ చేసుకున్న ఈ బ్యూటీ .. ఇప్పుడు మాత్రం హాట్ హాట్ రోల్స్ చేసుకుంటుంది .

మరీ ముఖ్యంగా డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో బోల్డ్ రొమాన్స్ చేయడానికి కూడా సిద్ధపడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ఓ మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. ఎందుకు మలయాళం ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది అన్న విషయంపై ఓపెన్ అయింది . నిజానికి ప్రేమమ్ సినిమా తర్వాత మలయాళం ఇండస్ట్రీలో అనుపమను బాగా ట్రోల్ చేశారట .

అప్పట్లో సినీ ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియని అనుపమ చచ్చినా ఇక మలయాల సినిమాలు చేయకూడదు.. అంటూ డిసైడ్ అయిపోయిందట . తర్వాత సోషల్ మీడియా అంటే ఏంటి ..? సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి ..? అంటూ తెలుసుకున్నాక అనుపమ మళ్లీ మలయాళంలో సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది . ఇప్పుడు తెలుగులోనూ మలయాళంలో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news