యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి సిరీస్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎలా మెప్పించాయో చూశాం. బాహుబలి 2 సినిమా అయితే తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించేసింది. ఇక 2017లో వచ్చిన బాహుబలి 1 మూవీ 600 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ అవ్వటానికి క్లైమాక్స్ కారణమైన సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు ? చెప్పాడు అన్న ప్రశ్న వల్లే బాహుబలి 1 అంచనాలకి మించి సక్సెస్ అవడంతో పాటు బాహుబలి 2 పై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేసింది.
దాదాపు రెండేళ్లపాటు ఈ ప్రశ్నకు ఆన్సర్ కోసం ఇండియన్ సినీ ప్రేక్షకులతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు. సోషల్ మీడియాలో దీనిపై జరిగిన రచ్చ అంతా కాదు. ఈ ట్విస్ట్ ద్వారా బాహుబలి పై అంచనాలు ఒక రేంజ్ లో పెంచడంలో రాజమౌళి సక్సెస్ అయ్యారు. వై కట్టప్ప ఫీల్డ్ బాహుబలి అంటూ సోషల్ మీడియా రచ్చ రచ్చ అయ్యింది. అయితే ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ సినిమా అని చాలామంది భావిస్తారు.
సింహాద్రి మూవీ ఇంటర్వెల్ – బాహుబలి వన్ క్లైమాక్స్ దాదాపు ఓకేలా ఉంటాయి. ఈ ట్విస్ట్ వల్ల ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ అయింది. ఈ రెండు సినిమాలుకు కథ అందించింది విజయేంద్రప్రసాద్. ఇక సింహాద్రి సినిమా కథకు స్ఫూర్తి వసంత కోకిల సినిమా అని ఆయన చాలాసార్లు చెప్పారు. మూగమనసులు సినిమా స్ఫూర్తితో జానకి రాముడు కథ రాశానని.. సింధూరపువ్వు సినిమాస్ఫూర్తితో సమరసింహారెడ్డి రాశానని విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో చెప్పారు.
ఇప్పుడున్న చాలామంది దర్శకులు, రచయితలు తాము ఇప్పుడు ఏ సినిమా నుంచి స్ఫూర్తి పొందకుండా కథలు రాశామని గొప్పలకు పోతూ ఉంటారు. కానీ విజయేంద్ర ప్రసాద్ మాత్రం తాను ఏ సినిమా నుంచి ఎక్కడి నుంచి స్ఫూర్తి పొంది కథలో రాస్తున్నానో ? ఓపెన్ గానే చెబుతూ ఉండటం నిజంగా ప్రశంసనీయం. ఇక విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబు – జక్కన్న కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆఫ్రికా అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాకు కూడా కథ అందిస్తున్న సంగతి తెలిసిందే.