ఇది నిజంగా మెగా అభిమానులకి స్వీట్ షాక్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అంతేకాదు వాళ్ళిద్దరిని కలిపింది ఇటలీ అని .. అక్కడే వాళ్ళ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వినపడ్డాయి . కానీ అదంతా ఫేక్ అంటూ క్లారిటీకి వచ్చేసింది . మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి హైదరాబాద్లోనే గ్రాండ్గా చేయబోతున్నారట కుటుంబ సభ్యులు .
దీనికి కారణం కూడా లావణ్య కుటుంబ సభ్యులు అంటూ తెలుస్తుంది . లావణ్య కుటుంబ సభ్యులు మెగా కుటుంబ సభ్యులు అందరూ ఇటలీలో పెళ్లి పెట్టుకుంటే చాలామంది రాలేరు అని.. మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ పెళ్లి అందరూ చూడాలి అని .. అందరూ మెగా వరుణ్ తేజ్ ని లావణ్యను ఆశీర్వదించాలి అని ..
అందుకే లాస్ట్ మినిట్ లో ఇటలీలో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని మరి హైదరాబాద్ లోనే గ్రాండ్ గా చేయబోతున్నారట . ఇదే న్యూస్ మెగా కాంపౌండ్ నుంచి లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా హ్యాపీ గా ఫీల్ అయి పోతున్నారు. చూద్దాం దీని పై మెగా ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో..?