టాలీవుడ్ లో దర్శకుడుగా తనదైన ముద్ర వేసుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారులోకం – ముకుంద – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – నారప్పా లాంటి సినిమాలు శ్రీకాంత్ అడ్డాల స్టామినా ఎంతో ప్రూవ్ చేశాయి. అదే టైంలో మహేష్ బాబుతో తీసిన బ్రహ్మోత్సవం సినిమాతో ఒక్కసారిగా పాతాళంలోకి వెళ్లిపోయాడు. తర్వాత నారప్పతో తనేంటో ప్రూవ్ చేసుకుని తాజాగా పెదకాపు 1 సినిమాతో ఈరోజు ప్రే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కొత్త హీరో విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన కథాంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆ టైంలో అధికారానికి అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు తమ అధికారాన్ని నిలుపుకునేందుకు ఏం చేశారు ? వీరి ఆధిపత్య పోరులో సామాన్యులు ఎలా సమిధులు అయ్యారు ? అన్న కథ అంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు గతంలో శ్రీకాంత్ – వెంకటేష్ తో తీసిన రీమేక్ సినిమా నారప్ప ప్రభావం ఆయన పై గట్టిగా పని చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామ రాజకీయాల నేపథ్యంలో సమాజంలో అసమానతలు, కుల వ్యవస్థల కారణంగా మనుషులు ఎలా ఇబ్బందులు పడ్డారు ? అనే కథాంశంతో నారప్ప – రంగస్థలం – దసరా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో పై మూడు సినిమాల్లో ఉన్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి.
దానికి తోడు సినిమా చూస్తున్నంత సేపు పై మూడు సినిమాలలో కొన్ని సీన్లు కలిపి తీసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ మూడు సినిమాల్లో ఉన్నంత నేచురాలిటీ పెదకాపు 1 సినిమాలో మిస్ అయింది. దర్శకుడు కథని నడిపించడంలోనూ భావోద్వేగల విషయంలోనూ పట్టుకోల్పోయినట్టు అనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే తొలిభాగంతోనే పెద్దగా ఆసక్తి రేపటి దర్శకుడు రెండో భాగం కూడా ఉందని ప్రకటించటం విచిత్రమే అని చెప్పాలి.