టైటిల్: పెదకాపు 1
నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నరేన్, నాగ బాబు, అనసూయ, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, బ్రిగడ సాగ
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు
సంగీతం: మిక్కీ జె. మేయర్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
దర్శకుడు : శ్రీకాంత్ అడ్డాల
రిలీజ్ డేట్ :సెప్టెంబర్ 29, 2023
పరిచయం:
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన సినిమా పెదకాపు 1. సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ తోనే మంచి బజ్ అందుకున్న ఈ సినిమాతో కొత్త హీరో విరాటకర్ణ హీరోగా పరిచయం అయ్యాడు. నారప్ప లాంటి హిట్ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ:
1982 లో ఎన్టీఆర్ రామారావు పార్టీ ప్రకటించిన సమయంలో జరిగే కథ ఇది. అధికార దాహంతో ఉన్న ఇద్దరు వ్యక్తులు బయన్న ( నరేన్) – సత్య రంగయ్య ( రావు రమేష్ ) లంక గ్రామాలలో సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉంటారు. కొత్త పార్టీ రావడంతో రెండు వర్గాల్లో కలకలం రేగుతుంది. తమ రాజకీయ ఆధిపత్యం కోసం రక్తపాతం సృష్టిస్తారు. ఇందులో సామాన్యులు బలవుతారు. ఆ ప్రభావం సత్య రంగయ్య దగ్గర పని చేసే పెదకాపు ( విరాట్ కర్ణ) కుటుంబం పై పడుతుంది. అదే సమయంలో పెద్దకాపు అన్న కనిపించకుండా మాయమవుతాడు. పెదకాపు అన్న ఏమయ్యాడు ? తమ ఆత్మ గౌరవం కోసం పెదకాపు ఏం చేశాడు ? రామారావు ఎవరికి టిక్కెట్ ఇచ్చారు ? అక్కమ్మ ( అనసూయ ) ఎవరు ? చివరికి ఈ పరిస్థితిలో అన్ని పెదకాపుని ఎక్కడికి తీసుకువెళ్లాయి ? అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ఆత్మ గౌరవం కోసం నిలబడి పోరాటం చేసిన సామాన్యుడు ఎలా నాయకుడు ? అన్నదే ఈ సినిమా కథ. తెరమీద సినిమా చూస్తున్నంత సేపు పెదకాపు సంతకమే కనిపించినా చాలా పాత్రలను ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. 1960వ దశకంతో కథ మొదలవుతుంది. అప్పుడు అనాధలా దొరికిన పాప ఎవరిని ఆసక్తి రేకిపించిన దర్శకుడు ఆ తర్వాత కథని 1980లోకి తీసుకువచ్చాడు. పెద్దకాపు అనే పేరు ఎందుకు వచ్చింది ? ఆ పాత్ర ప్రపంచం ఏమిటో పరిచయం చేయకుండానే నేరుగా ఆత్మగౌరవం అంటూ జెండా పాతటం నుంచి రంగంలోకి దిగిపోయాడు. అయితే పాత్రలతో పాటు కథ ఏంటనేది సగం సగం పరిచయం చేసి సినిమా మొదలుపెట్టడంతో సినిమా స్టార్టింగ్ లో అయోమయంగా ఉంటుంది.
ఎలాంటి కనెక్టివిటీ ఎమోషనల్ లేకుండానే సన్నివేశాలు సాగిపోతూ ఉంటాయి. సామాన్యుడి సంతకం అని చెప్పిన దడుకుడు హీరో పాత్రను సామాన్యుడు కోణంలో ఆవిష్కరించలేదు. హీరో చెప్పే డైలాగులు కూడా చాలా లోతుగా ఆలోచిస్తే తప్ప అసలు అర్థం కావు. హీరో ఓ సామాన్యుడు అన్నట్టుగా ఉండదు. సినిమా ఆరంభం నుంచి ట్రాక్ తప్పినట్టు అనిపించినా హీరో సోదరుడు ఏమయ్యాడు ? ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న కథేమిటి అనే ప్రశ్నలు ప్రేక్షకుడిని ఆసక్తిగా మలుస్తాయి.
ఇక కథపరంగా చూసిన కొత్త కదేమి కాదు. గ్రామ రాజకీయాల నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో కథ ఇందులోనూ ఉంటుంది. నారప్ప – రంగస్థలం – దసరా తదితర సినిమాఛాయలు ఇందులో కనిపిస్తాయి. పాత్రలు అవి మలిచిన తీరులోనూ నేచురాలిటీ అస్సలు కనిపించదు. అనసూయ పాత్రని చేరదీసిన మహిళ ఆ తర్వాత ఏమవుతుందో అర్థం కాదు. ఇటు ప్రేమ కథలోను బలం లేదు. రావు రమేష్ కి రాసిన డైలాగులతో పాటు తన పాత్ర తీర్చిదిద్దటం బాగుంది. అనసూయ సాలిడ్ పెర్ఫామెన్స్ కూడా కనపరిచింది. ఇక సినిమాలో సెకండ్ హాఫ్ ప్రధాన బలం అని చెప్పాలి. సెకండాఫ్ లో వచ్చే డీటెయిల్స్ బాగున్నాయి.
సినిమాలో చాలా అంశాలు డీటెయిల్ గా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇది ప్రేక్షకుడికి ఒకింత పరీక్ష పెట్టేలా ఉంటుంది. దర్శకుడు చాలా విషయాలలో క్లియర్గా అన్ని వివరించే ప్రయత్నం చేసినా.. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం చేయడానికి సరిపోయింది. దీంతో కథనం కాస్త స్లో ఉంటుంది. అలాగే సినిమాలో స్క్రీన్ ప్లే కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఇది అందరికీ కనెక్ట్ అవుతుందా ? అంటే కష్టం. ఈ సినిమా చూస్తుంటే మనం ఇప్పటికే చూసిన రంగస్థలం – దసరా – రక్త చరిత్ర లాంటి సినిమాలు కూడా గుర్తుకు వస్తాయి. సినిమాలో కొన్ని అంశాలు రిపీటెడ్ గా వచ్చినట్టు కూడా ఉంటుంది.
నటీనటుల పెర్పామెన్స్ :
హీరో విరాట్ కర్ణకి ఇదే తొలి సినిమా అయినా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. నటనలో పరిణితి ప్రదర్శించాడు. యాక్షన్స్ సన్నివేశాల్లో బాగా నటించాడు లుక్స్ బాగున్నాయి. హీరోయిన్ ప్రగతి శ్రీవాత్సవ అందంగా కనిపించిన ఆ పాత్రలో బలం లేదు. గౌరీ పాత్రలో బ్రిగడ చాలా నేచురల్ గా కనిపించింది. అక్కమ్మ పాత్రలో అనసూయ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. సినిమాలో కాస్త అయినా ఎమోషన్ సీన్లు పడ్డాయి అంటే కేవలం అనసూయ పాత్ర వల్లే. సత్యా రంగయ్య పాత్రలో రావు రమేష్ అసలు సిసలు విలనిజం ప్రదర్శించాడు. ఆయన పాత్ర ప్రభావాన్ని కొనసాగించేలా కొడుకు కన్నబాబు పాత్రలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన నటనతో అదరగొట్టాడు. కుర్చీలో కూర్చునే అదిరిపోయే విలనిజం ప్రదర్శించాడు. మరో విలన్ గా నరేన్ తన పాత్రలో ఒదిగిపోయాడు. నాగబాబు – తనికెళ్ల భరణి పాత్రలు సినిమాలో కీలకం.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే..
సినిమా టెక్నికల్ గా ఉన్నతంగా ఉంది. సినిమాకు చోటా కె నాయుడు ఛాయాగ్రహణం ప్రధాన బలం. గోదావరి నేపథ్యాన్ని ఎంతో అందంగా తెరపైకి తీసుకువచ్చాడు. జెండా పాతిన సన్నివేశాలు మొదలుకొని చివరి వరకు ప్రతి ఫ్రేమ్ అద్భుతం అనిపిస్తుంది. మరో ఆకర్షణ ఈ సినిమా కోసం అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పెట్టిన ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే తాను రీమేక్ చేసిన నారప్ప ప్రభావంతో ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. మాటలతో కొంత మ్యాజిక్ చేసినా.. కథ, కథనాలతో పాటు స్క్రీన్ ప్లే ఇంకా సరళంగా రాసుకోవాల్సి అనిపించింది. చెప్పాలి అనుకున్న పాయింట్ క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేసిన కొన్నిచోట్ల రిపీటెడ్ గా.. కొన్నిచోట్ల స్లోగా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమాతో మనం ఒక సరికొత్త శ్రీకాంత్ అడ్డాల సినిమాని చూడొచ్చు.
ఫైనల్‌గా..
పెదకాపు 1 ఇంటెన్స్ ఎమోషన్స్ అండ్ ఎంగేజింగ్ సీన్స్ తో జస్ట్ ఓకే అనిపిస్తుంది. హీరో విరాట్ మంచి డెబ్యూ మూవీ అందుకున్నాడు. స్లో నరేషన్ అక్కడక్కగా కొన్ని డిస్టబింగ్ సీన్స్ తో ఈ సినిమా అందరికి కనెక్ట్ కాకపోవచ్చు. మరీ బోర్ కొడితే ఈ వారాంతంలో వన్ టైం వాచ్‌బుల్ మూవీ.
ఫైనల్ పంచ్: తడబడిన శ్రీకాంత్ అడ్డాల సామాన్యుడి సంతకం
TL రేటింగ్ : 2.5/5