గబ్బర్ సింగ్ లాంటి ట్రెండ్ సెట్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. చాలా రోజుల క్రితమే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తోంది. ఇటీవల బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ఓజి సినిమా చేస్తున్నారు. ఆ సినిమాతో పాటు ఉస్తాద్ సినిమాకు సమానంగా కాల్ సీట్లు కేటాయించారు.
పూర్తి చేసుకోగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఆ షెడ్యూల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోకి ట్రెండింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం పవన్ పొలిటికల్ గా కాస్త బిజీగా ఉండడంతో పాటు వారాహి యాత్ర చేయాల్సి ఉండడంతో భగత్ సింగ్ షూటింగ్ పడుతూ లేస్తూ సాగుతోంది. ఇక 26 నుంచి తాజా షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. ఈ నెలాఖరు వరకు గ్యాప్ లేకుండా పవన్ ఈ షెడ్యూల్ షూటింగ్లో పాల్గొంటాడు.
తాజాగా నిన్న ఈ సినిమా షూటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం అయితే అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగింది. శ్రీలీల ఈరోజు షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. అయితే అదే సమయంలో గుంటూరు కారం షూటింగ్ కూడా ఉండడంతో అనుకున్న టైంకు భగత్ సింగ్ సినిమా సెట్స్ కు రాలేకపోయింది. సాయంత్రం సమయానికి గుంటూరు కారం షూటింగ్ అయిపోవడంతో అప్పుడు భగత్ సింగ్ సినిమా సెట్స్ కు వచ్చింది. రాత్రి 9 గంటలకు సెట్స్‌లోకి అడుగుపెట్టగా అర్ధరాత్రి రెండు గంటల వరకు షూటింగ్ జరిగింది.
పవన్ కళ్యాణ్ కూడా ఈ షూటింగ్లో పాల్గొన్నారు. శ్రీలీల కోసం అంత సేపు పవన్ కళ్యాణ్ వేచి ఉన్నాడంటే నిజంగా పవన్ కి పని పట్ల ఉన్న డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అసలే పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. పవన్ కాల్ షీట్లు దొరకటం కూడా కష్టంగా ఉంది. అలాంటి టైంలో శ్రీలీల పవన్‌ను అర్ధరాత్రి వరకు వెయిట్ చేయించడం అంటే శ్రీలీల డిమాండ్ ఎలా ? ఉందో అర్థమవుతుంది. ఇంకా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.