ఇండస్ట్రీలో అతిలోకసుందరి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది శ్రీదేవి .. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈమె అతి చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోని స్టార్ హీరోయిన్గా మారిన శ్రీదేవి ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలతో మంచి రాపో ని మెయిన్ టైన్ చేసింది . ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరు ఆమెకు నెగిటివ్గా ఏ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదు ..అంటే ఆమె ఎంత మంచి మినిషి అనేది అర్థం చేసుకోవచ్చు .
అయితే శ్రీదేవి దుబాయ్ లో పెళ్లికి వెళ్ళినప్పుడు హోటల్లో బాత్రూంలో కాలుజారి పడి మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అది ఆమె సహజ మరణం కాదు కావాలని ఎవరు చంపేశారు అంటూ ఫ్యాన్స్ ఇప్పటికే ఆమె మరణం పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు . అయితే శ్రీదేవి మరణించే విషయం ఆమె ఆస్ట్రాలజర్ ముందే చెప్పారట. అదే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అందుకే శ్రీదేవి ముందు జాగ్రత్తగా ఆమె ఆస్తి వివరాలు మొత్తం తన కూతుర్లు ఖుషి కపూర్ జాన్వికపూర్ కు వివరించిందట .
కరెక్ట్ గా మరణించే నెల రోజులు ముందే ఆమెకు తన జ్యోతిష్యుడు మరికొన్ని రోజుల్లోనే మీరు మరణించపోతున్నారు అన్న విషయం చెప్పారట . దీంతో షాక్ అయిపోయిన శ్రీదేవి నమ్మకపోయినా సరే ఎక్కడో అనుమానం వచ్చి ఖుషి కపూర్ కు జాన్వికపూర్ కు తన ఆస్తిపాస్తుల గురించి తన మరణించాక వాళ్లకు చెందే హక్కుల గురించి మొత్తం వివరించిందట . దీన్ని చాలా లైట్ గా తీసుకున్న ఖుషి – జాన్వి ఆ తర్వాత అమ్మ మరణించాక అసలు విషయం తెలుసుకొని చాలా చాలా బాధపడ్డారట. జాతకాలు నమ్మకపోయినా సరే శ్రీదేవి తన కూతుర్లకి ముందుగా తన ఆస్తిపాస్తులు గురించి వివరించడం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది..!!