MoviesANR మొదటి సంపాదన ఎంతో తెలుసా.. ఆ డబ్బులతో ఏం చేసారంటే.....

ANR మొదటి సంపాదన ఎంతో తెలుసా.. ఆ డబ్బులతో ఏం చేసారంటే.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సత్యం..!!

ఇప్పుడంటే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు కోట్లకు కోట్లు తీసుకుంటున్నారు . కానీ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు రెమ్యూనరేషన్ గురించి ఆలోచించలేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు ఎన్నో సినిమాల్లో రూపాయి కూడా పారితోషకం తీసుకోకుండా నటించాడు అన్న విషయాన్ని మనకు తెలిసిందే . కాగా రీసెంట్గా అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. 90 ఏళ్ళ వయసు వచ్చేవరకు కూడా ఇండస్ట్రీలో కొనసాగిన ఏఎన్ఆర్ దాదాపు 75 సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగారు .

కేవలం హీరో గానే కాకుండా నిర్మాతగా.. స్టూడియో అధినేతగా కూడా కీలక బాధ్యతలు తీసుకొని అన్నపూర్ణ స్టూడియోస్ ను విజయవంతంగా ముందుకు తీసుకొచ్చారు . అయితే ఏఎన్ఆర్ మొదటి పారితోషకం ఎంత అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది . కాగా ఏఎన్ఆర్ గారు మొదట రంగస్థలంలో నాటకంలో పాత్ర పోషించే వారట . అప్పుడు ఆయన అక్షరాల 50 పైసలు తీసుకున్నారు అన్న వార్త వైరల్ అవుతుంది .

అంటే అర్ధ రూపాయి తన మొదటి పారితోషకం. అర్ధ రూపాయి.. అది కూడా ఏఎన్ఆర్ చాలా అపురూపకంగా దాచుకున్నారట . సినిమాలో వచ్చాక ఐదు రూపాయలను పారితోషకంగా తీసుకున్న ఆయన ఆ తర్వాత మెల్లమెల్లగా 100 రూపాయలు 500 తర్వాత 1000 ఆ తర్వాత అలా వేలు అలా వేలకోట్ల ఆస్తిని సంపాదించారు . ఎంత ఎత్తు ఎదిగిన మన మొదటి సంపాదన మర్చిపోకూడదు అన్న కారణంతో ఆ అర్ధ రూపాయిని అంతే జాగ్రత్తగా పదిలంగా దాచుకున్నారట . ఇప్పటికి అర్ధరూపాయి నాగార్జున వద్ద జాగ్రత్తగా ఉంది అంటూ కూడా తెలుస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news