స్టార్ సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ ఎంత లగ్జరీయస్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ సెలబ్రిటీల ఇంట్లో ఎంతటి కాస్ట్లీ వస్తువులు ఉంటాయి వాళ్ళు ఎంతటి హై లైఫ్ స్టైల్ కి అలవాటు పడి ఉంటారు మనకు తెలిసిందే. అయితే కేవలం వాళ్ళ బ్యూటీ ప్రొడక్ట్స్ విషయంలోనే కాదు చదువుల విషయంలోనూ అదే రేంజ్ లో కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు . స్టార్ కిడ్స్ చదువుల విషయంలో కూడా లక్షల్లో కోట్లు పోస్తూ ఉంటారు .
ఈ క్రమంలోనే తాజాగా ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ గారాల కూతురు ఆరాధ్య స్కూల్ ఫీజు గురించి సంబంధించిన న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ లకు ఓ పాప ఉంది. ఆమె పేరే ఆరాధ్య ఎంతో ముద్దుగా గారాబంగా పెంచుకుంటున్నారు. అంతేకాదు ఆమె అడిగింది కాదు లేదు అనకుండ తీసి ఇస్తూ ఉంటారు . అంతటి స్టార్ స్టేటస్ కూడా వాళ్లకు కలిగి ఉంది. కాగా ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య స్కూల్ ఫీజు విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఈ రోజుల్లో పిల్లల్ని చదివించాలి అంటే లక్షలు కుమ్మరించాలి ఈ విషయం అందరికీ తెలిసిందే . మిడిల్ క్లాస్ లోనే ఇలాంటి లక్షణాలు ఉంటే మరి హై క్లాస్ వాళ్ళు ఎంత డబ్బులు పెడుతున్నారు అన్న విషయం తెలుసుకోవాలని అందరికీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఐశ్వర్యరాయ్ కూతురు అంబానీ ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటుంది . ఈ స్కూల్లో ఫీజు పది లక్షలకు పైగానే ఉంటుందట . ఎల్కేజీ నుంచి 10వ తేదీ వరకు దాదాపు 10 – 15 లక్షల ఫీజు ఉంటుందట . ఆ తర్వాత ప్లస్ వన్ ప్లస్ టు గా పిలవబడే ఇంటర్మీడియట్ కు దాదాపు 20 నుంచి 25 లక్షలు చేస్తారట ఇది ఓన్లీ స్కూల్ ఫీజు మాత్రమే.. ఆ తర్వాత బుక్స్,యాక్ససరీస్, యోహ్గా, కరాటే, స్విమ్ అంతా కలిపి 50 లక్షలు పైగానే దాటిపోతుంది . అంతేకాకుండా వీళ్ళకి ఇదే ఫుడ్ డైట్ పంపించాలి అన్న విధంగా కూడా కండిషన్స్ పెడతారట. మొత్తానికి స్కూల్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయే సరికి వీళ్ళకి దాదాపు 70 – 80 లక్షలు ఇంకొన్నిసార్లు కోటి రూపాయలు కూడా అవుతుందట . చాలామంది డబ్బు ఉన్న స్టార్ సెలబ్రిటీస్ పిల్లలందరూ ఇదే స్కూల్లో చదువుతూ ఉండడం గమనార్హం..!!