కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార .. కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అప్పుడప్పుడే పాపులారిటీ దక్కించుకున్న విగ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే . కాగా వీళ్ల పెళ్లి తర్వాత ఎన్నో చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఫైనల్లీ ఆ చిక్కులను అధిగమించిన ఈ జంట సరోగసి ద్వారా పిల్లలను కనీ తల్లిదండ్రులయ్యారు .
అంతేకాదు వాళ్ళ పుట్టిన రోజు చాలా చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేశారు . నయనతార – విగ్నేష్ కు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వీరి మొదటి పుట్టినరోజు వేడుకలను మలేషియాలో చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు . అంతే కాదు పిల్లలతో సరదాగా గడుపుతూ ఎంతో ఇష్టంగా టైం స్పెండ్ చేశారు . దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి . అయితే వీళ్ళు తమ పిల్లల పుట్టిన రోజు కోసం స్పెషల్గా మలేషియాకు వెళ్లి మరి సెలబ్రేట్ చేసుకున్నారు .
అంతే కాదు పిల్లల కోసం పెద్దగా హడావిడి చేయని నయనతార పిల్లలు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆమె దాదాపు 100 అనాధ శరణాలయాలలో ఫుడ్ బట్టలు డొనేట్ చేయించిందట. వీటికి దాదాపు 60 – 70 లక్షల పైగానే ఖర్చు అయినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాదు నయనతార తన పిల్లల ప్రతి పుట్టినరోజుకు ఇదే పని చేయడానికి నిశ్చయించుకుందుట . ఇది చాలా మంచి నిర్ణయం అంటూ ఆమెను పొగిడేస్తున్నారు.