సినిమా ఇండస్ట్రీలో నీతి వ్యాఖ్యలు చెప్పే వాళ్ళందరూ నీతి నియమాలు పాటిస్తారా..? అంటే నో అని చెప్పాలి . మరి ముఖ్యంగా హీరోయిన్స్ ఆ విషయంలో అస్సలు నమ్మలేము.. పైకి మాత్రం చాలా పద్ధతిగా నిజాయితీగా మాట్లాడే హీరోయిన్స్ ..తెరవెనుక మాత్రం నీతిమాలిన పనులు ఎన్నో చేస్తూ ఉంటారు అని సినీ జనాలు కామెంట్స్ చేస్తూ ఉంటారు . అయితే వాళ్లందరిలోకి ప్రత్యేకం సాయి పల్లవి అంటూ చాలామంది ఆమెను ఓ రేంజ్ లో పొగిడేసారు.
రొమాంటిక్ సీన్స్ చేయను.. వల్గర్ సీన్స్ లో నటించను బోల్డ్ డైలాగ్స్ చెప్పను.. నేటి తరానికి మరో మహానటి సావిత్రి అంటూ ఓ రేంజ్ లో బిరుదులు కూడా ఇచ్చేశారు . అయితే సాయి పల్లవి కూడా తన లిమిట్స్ క్రాస్ చేస్తుంది అని రీసెంట్ గానే సినీవర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి . నిన్న మొన్నటి వరకు నాకు డబ్బు మీద మోజులేదు .. ఆశ లేదు మేకర్స్ ఎంత ఇస్తే అంతే పుచ్చుకుంటాను అని చెప్పే సాయి పల్లవి.. రీసెంట్గా నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేసిందట.
నిజానికి సాయి పల్లవికి హిట్ ట్రాక్ లేదు .. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తప్పిస్తే ఆమె హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. పైగా గ్లామరస్ గా కనిపించదు ..అందంగా ఉంటుంది మాత్రమే.. కానీ గ్లామరస్ గా కనిపించదు .మరి అలాంటి హీరోయిన్ కి కమర్షియల్ సినిమాలో ఐదు కోట్లు రెమ్యూనరేషన్ ఎలా ఇస్తారు అనేది కామన్ పీపుల్స్ క్వశ్చన్..? కానీ మేకర్స్ సాయి పల్లవికున్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారట . ఫైనల్లీ సాయి పల్లవి కూడా అదే కోవాలోకి వస్తుందని.. డబ్బు కోసం పని చేసే హీరోయిన్ అని ఘాటుగా స్పందిస్తున్నారు జనాలు..!!