Newsకొర‌టాల - బోయ‌పాటి మ‌ధ్య ఉన్న బంధుత్వం ఇదే... వ‌రుస‌కు ఏమ‌వుతారంటే...!

కొర‌టాల – బోయ‌పాటి మ‌ధ్య ఉన్న బంధుత్వం ఇదే… వ‌రుస‌కు ఏమ‌వుతారంటే…!

టాలీవుడ్ లో ఇద్దరూ క్రేజీ దర్శకులు బోయ‌పాటి శ్రీను – కొరటాల శివ ఇద్దరు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకులు అయితే వీరిద్దరూ పోసాని కృష్ణమురళికి బంధువులు. పోసానికి కొరటాల మేనత్త కొడుకు అవుతాడు. అలాగే పోసాని భార్య‌ తరపు బంధువు బోయపాటి. వీరిద్దరు ముందుగా పోసాని దగ్గర శిష్యరికం చేసినవారే. బోయపాటి ముందుగా రవితేజ హీరోగా వచ్చిన భద్ర సినిమాతో దర్శకుడు కాగా ఆ తర్వాత చాలా ఏళ్లకు కొరటాల ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడుగా మారారు.

భద్ర సినిమాకు రచయితగా సహకారం అందించారు కొరటాల. అయితే స్క్రీన్ మీద తన పేరు లేకపోవడంతో కొరటాల ఆవేదనకు గురైనట్టు కొర‌టాల చాలాసార్లు చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే బోయపాటి మీద ఉన్న కోపంతోనే కొరటాల దర్శకుడి అవతారం ఎత్తానని చాలాసార్లు చెప్పారు. ఇక శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అయ్యాక బోయపాటిని టార్గెట్ చేస్తూ కొరటాల చాలాసార్లు మాట్లాడారు.

అటు పోసాని కూడా చాలాసార్లు కొరటాలకే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇక బోయపాటి ఈ గొడ‌వ‌పై స్పందిస్తూ భ‌ద్ర సినిమాకు చాలా మంది ప‌నిచేశార‌ని… అయితే వారిలో కొర‌టాల కూడా ఒక‌రు మాత్ర‌మే అని.. ఒక‌టి రెండు సీన్ల విష‌యంలో సాయం చేసిన కొర‌టాల పేరు వేయాల్సి ఉంటే అంత‌కంటే ఎక్కువ క‌ష్ట‌ప‌డిన వారి పేర్లు కూడా వేయాల‌ని… ఇందులో త‌న త‌ప్పేం లేద‌న్న‌ట్టుగా చెప్పారు.

బోయ‌పాటి చివరగా బాలయ్యతో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తెరకెక్కించారు. రామ్ తో తెర‌కెక్కించిన స్కంద సినిమా రేపు థియేటర్లలోకి వస్తుంది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో దేవర సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరూ వరుసకు బావా బావా మరదలు అవుతారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news