సినిమా ఇండస్ట్రీలో హీరో గోపీచంద్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పుడంటే ఆయన పేరుకు పెద్ద క్రేజీ లేదు కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మాత్రం ఆయన పేరు రేంజ్ లో మారు మ్రోగి పోయింది. మరి ముఖ్యంగా త్రిష ప్రభాస్ హీరో గా త్రిష హీరోయిన్ గా నటించిన వర్షం సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించిన గోపీచంద్ కెరీర్ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది .
అంతేకాదు పలు సినిమాల్లో విలన్గా నటించిన ఈయన మళ్ళీ హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు. ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది ఆ దేవుడికే తెలియాలి. అయితే గోపీచంద్ మంచితనానికి మెచ్చి ఓ హీరోయిన్ తండ్రి ఏకంగా ఆయనను నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటూ ఫోర్స్ చేశారట . నాకు ఇష్టం లేదు రా బాబోయ్ అంటున్న కూడా పెళ్లి చేసుకో పర్లేదు అంటూ బలవంతం చేశారట.
ఆ హీరోయిన్ మరెవరో కాదు కామనా జెత్మలాని. వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కిన సినిమా రణం . ఈ సినిమా గోపీచంద్ కెరీర్ ని మరోసారి నిలబెట్టింది. వాళ్ల మధ్య సీన్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి . ఆ టైంలో గోపీచంద్ ప్రేమిస్తున్నారని.. వీళ్ళ మధ్య ప్రేమాయణం బాగా ముదిరిపోయింది అంటూ ప్రచారం జరిగింది. అయితే “అదే టైంలో హీరోయిన్ నాన్న నా కూతురు అంటే నీకు నిజంగా ఇష్టం ఉంటే.. నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను ..ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్పు.. నీలాంటి మంచి అబ్బాయిని నేను అల్లుడుగా తెచ్చుకోలేను “అంటూ ఆయనకు ఇష్టం లేకపోయినా సరే బలవంతం చేశారట . అంతేకాదు అర్థరాత్రి ఫోన్ చేసి మరి ఇంకోసారి ఆలోచించుకో అంటూ తెగ విసిగించేసాడట . అయితే గోపీచంద్ మాత్రం సైలెంట్ గానే మేమిద్దరం ఫ్రెండ్స్ అండి అంటూ ఆయన ఆఫర్స్ సున్నితంగా రిజెక్ట్ చేశారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అలా గోపీచంద్ తన మంచితనాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు..!!