తెలుగు అమ్మాయి, హీరోయిన్ కలర్స్ స్వాతి చూడటానికి మన పక్కింటి పిల్లలా అనిపిస్తుంది. గలగల మాట్లాడే వాయిస్.. చిలిపికళ్ళు.. చూడగానే ఆకట్టుకునే రూపం ఆమెకు ప్లస్సులు. బుల్లితెరపై
బాగా పాపులర్ అయిన కలర్స్ స్వాతి ఆ తర్వాత వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నానితో కలిసి అష్టాచెమ్మా సినిమా కూడా చేసింది. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాక ఆమె పెళ్లి చేసుకుని కొంతకాలం వైవాహిక జీవితంలో ఉన్నా ఇప్పుడు భర్తతో మనస్పర్ధలు నేపథ్యంలో దూరంగా ఉంటున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
ఇక త్రిపుర సినిమా తర్వాత యంగ్ హీరో నవీన్ చంద్ర – కలర్స్ స్వాతి కలిసి నటిస్తున్న సినిమా మంత్ ఆఫ్ మధు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నవీన్ తాజా ఇంటర్వ్యూలో ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. స్వాతితో తనకు వివాహం జరిగిందంటూ గతంలో జోరుగా వార్తలు వచ్చాయని.. ఈ వార్తలు రావడానికి కారణం కూడా చెప్పాడు.
త్రిపుర సినిమా కోసం మొదటిసారిగా తన స్వాతితో కలిసి పనిచేశా.. ఆమె చాలా మంచి వ్యక్తి.. మా ఇరు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది.. త్రిపుర ప్రమోషన్లలో భాగంగా సినిమా యూనిట్ మొదట ఒక ఫోటో రిలీజ్ చేసింది.. అందులో నేను స్వాతి పెళ్లి దుస్తుల్లో ఉన్నాం.. అప్పట్లో ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.. అది చూసిన చాలామంది మాకు నిజంగానే పెళ్లయింది అనుకున్నారని చెప్పాడు.
కొన్ని రోజుల తర్వాత అదే ఫోటోని పోస్టర్ గా రిలీజ్ చేయడంతో అది చూశాక గాని చాలామందికి ఇది సినిమా కోసం జరిగిన పెళ్లి అన్న క్లారిటీ రాలేదు.. అయితే ఆ ఫోటో బయటకు వచ్చిన సమయంలో చాలామంది సినిమా వాళ్ళు కూడా స్వాతిని పెళ్లి చేసుకున్నారా ? అని నన్ను డైరెక్ట్గా అడిగేసారని ఈ విషయాన్ని స్వాతి సీరియస్గా తీసుకోలేదు.. తాను పెద్దగా పట్టించుకోలేదని నవీన్ చంద్ర చెప్పాడు.