Newsప‌వ‌న్‌ను టార్గెట్ చేయ్‌.. పూన‌మ్‌కౌర్‌కు వేధింపులు....!

ప‌వ‌న్‌ను టార్గెట్ చేయ్‌.. పూన‌మ్‌కౌర్‌కు వేధింపులు….!

హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ విషయంలో ఆమె చేసిన కామెంట్లు టాలీవుడ్ లో పెద్ద దుమారం రేపాయి. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పూనమ్ ఎప్పుడు పరోక్షంగా విరుచుకుపడుతూనే ఉంటారు. అసలు పవన్‌తో ఆమె గొడవ ఏంటో ఎప్పుడు ? బయటకు చెప్పలేదు. అయితే పవన్ – పూనం మధ్య మొత్తానికి ఏదో జరిగిందన్న ప్రచారం అయితే ఇండస్ట్రీలో ఉంది. మధ్యలో త్రివిక్రమ్ కూడా పవన్ వైపు నిలిచి తనకు అన్యాయం చేశారన్న భావన పూన‌మ్ మ‌దిలో బలంగా ఉంది.

అందుకే పూన‌మ్‌ అటు పవన్‌తో పాటు ఇటు త్రివిక్రమ్ పై ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన కామెంట్ పెట్టారు. ఇది ఇప్పుడు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ హైలైట్ గా మారింది. తనను రాజకీయంగా కొందరు పావుగా వాడుకుంటున్నారని ఆవేదన ఆమె వ్యక్తం చేశారు. తాను ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు.. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను.. కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం నన్ను పావుగా వాడాలని అనుకుంటున్నారు,, ఒక మహిళపై ఇలాంటి కుట్రలు తగవ‌ని చెప్పింది.

నేను సిక్కుబిడ్డను.. నాకు త్యాగాలు తెలుసు పోరాటాలు తెలుసు.. దయచేసి మీ రాజకీయాల కోసం నన్ను లాగొద్దు.. నా వైపు నుంచి ఏదైనా అప్డేట్ ఉంటే నేనే చెబుతాను అని పూనం కామెంట్ చేశారు. అయితే ఆమె చేసిన కామెంట్ ను బట్టి చూస్తే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్న పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయాలని కొందరు ఆమెపై ఒత్తిడి చేయడం, వేధింపులు చేయటం మొదలు పెట్టారని క్లియర్ గా తెలుస్తోంది.

ఇదే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చ‌ర్చ‌కు కూడా వస్తోంది. పూన‌మ్‌ పవన్ కళ్యాణ్ను ఎప్పుడు టార్గెట్ చేయ‌డం కాదు… ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో పవన్ ను గట్టిగా టార్గెట్ చేయాలని ఆమెపై కొందరు ఒత్తిడి చేస్తున్నారని అది నచ్చకే ఆమె ఇలా కామెంట్ పెట్టిందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే ఆమె తనపై ఒత్తిడి చేస్తున్నది ఎవరో చెప్పకపోవడం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news