Newsవిజ‌య‌నిర్మ‌ల‌కు న‌రేష్ కాకుండా మ‌రో కొడుకు ఉన్నాడా... ఆ కొడుకు అన్యాయం...

విజ‌య‌నిర్మ‌ల‌కు న‌రేష్ కాకుండా మ‌రో కొడుకు ఉన్నాడా… ఆ కొడుకు అన్యాయం చేసిందా…?

టాలీవుడ్ లో దివంగత నటి విజయనిర్మల ఎంత గొప్ప న‌టో, ద‌ర్శ‌కురాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె గొప్ప నటి మాత్రమే కాదు గొప్ప క‌థా రచ‌యిత, దర్శకురాలు డైలాగ్ రైట‌ర్‌ కూడా ఆమె సినిమాల్లోకి రావటమే అనుకోకుండా జరిగింది. విజయనిర్మల మొదటి భర్త ప్రోత్సాహం మేరకు బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రంగులరాట్నం సినిమాలో ఒక పాత్రలో నటించింది. ఆ పాత్రలో ఆమెకు భర్తగా ఆమె మొదటి భర్త నటించారు. ఆ సినిమాలో విజయనిర్మ‌ల‌ పాత్రకు మంచి పేరు వచ్చింది.

అక్కడ నుంచి సినిమాలపై మక్కువ పెంచుకున్న ఆమె వరుసగా సినిమాల్లో నటించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణతో ఎన్నో విజయవంతమైన సినిమాలలో విజయనిర్మల నటించారు. వీరిద్దరి సాన్నిహిత్యాన్ని చూసి అపార్థం చేసుకున్న విజయనిర్మల భర్త ఆమెకు కృష్ణ గారికి లేనిపోని సంబంధాలు అంటగడుతూ ఆమెను టార్చర్ చేయడం ప్రారంభించారు.

చాలా రోజులు ఓపిక పెట్టిన విజయనిర్మల చివరకు భరించలేక సహనం కోల్పోయి తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చేశారు. అయితే అప్పటికే ఆమెకు మొదటి భర్త ద్వారా సురేష్- నరేష్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. వీరిద్దరు విడాకులు తీసుకున్న టైంకు నరేష్ చిన్నపిల్లోడు కావడంతో పెద్ద కుమారుడు సురేష్ ను మొదటి భర్త దగ్గర వదిలేసి నరేష్‌ను తీసుకొని కృష్ణ ఇంటికి వచ్చేసారు. సాక్ష్యం సినిమా తర్వాత కృష్ణ ఆమెను వివాహం చేసుకున్నారు.

ఇక నరేష్ చిన్నప్పటినుంచి విజయనిర్మల- కృష్ణ కుమారుడిలాగానే పెరిగాడు. ఇక విజయనిర్మ‌లకి విడాకులు ఇచ్చేశాక ఆమె మొదటి భర్త కూడా మరో వివాహం చేసుకున్నారు. అయితే తన పెద్ద కుమారుడు అయిన సురేష్ ను మాత్రం తండ్రి దగ్గర వదిలేయడంతో ఆమె సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తిలో అతడు భాగం కాకుండా పోవడం జరిగింది. ఇక విజయనిర్మల సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులు అన్ని నరేష్ సొంతం అయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news